ఆటో కదిలే దాకా డౌటే!

ఆటోనగర్‌ సూర్య చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేస్తున్నామని నిర్మాతలు మరోసారి ప్రెస్‌ నోట్‌ పంపించారు. అయితే దీని ఆధారంగా ఈ చిత్రం ఖచ్చితంగా విడుదలవుతుందని అనుకోవడానికి లేదు. ఇప్పటికే ఇలాంటి ప్రెస్‌నోట్లు…

ఆటోనగర్‌ సూర్య చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేస్తున్నామని నిర్మాతలు మరోసారి ప్రెస్‌ నోట్‌ పంపించారు. అయితే దీని ఆధారంగా ఈ చిత్రం ఖచ్చితంగా విడుదలవుతుందని అనుకోవడానికి లేదు. ఇప్పటికే ఇలాంటి ప్రెస్‌నోట్లు పదుల కొద్దీ పంపించారు. కానీ ప్రతిసారీ సినిమాని వాయిదా వేసారు. ఇప్పటికీ ఈ సినిమాకి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అయితే తీరలేదు. 

మనం విజయంతో చైతన్యకి పెరిగిన క్రేజ్‌ని బట్టి, సినిమాలు ఏవీ లేని సీజన్‌ని క్యాష్‌ చేసుకోవాలని ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. నిజంగా వస్తే ఈ సినిమాకి ఇది అనుకూల సమయం కానీ ఉన్న సమస్యలన్నీ ఉన్నపళంగా తీరిపోయి రెండు వారాల్లో సినిమా రిలీజ్‌ కావడం మాత్రం డౌటేనని అంటున్నారు. 

చైతన్య కూడా సినిమా ఖచ్చితంగా రిలీజ్‌ అవుతుందని తనకి నమ్మకం వచ్చిన తర్వాతే ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటాడట. ఈ చిత్రం మొదలు పెట్టిన టైమ్‌లో అయితే దీనిపై అంచనాలు చాలా ఉండేవి. అయితే రెండేళ్లకి పైగా డిలే కావడంతో ఈ చిత్రం గురించి చైతన్య అభిమానులు మినహా మరెవరూ ఎక్సయిట్‌ అవడం లేదు. ఈసారి అయినా వాయిదా పడకుండా సూర్యుడు వెలుగు చూస్తాడని ఆశిద్దాం.