విజయ్ సేతుపతి తరువాత తెలుగు ప్రేక్షకులను గట్టిగా ఆకర్షిస్తున్న తమిళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరలక్ష్మి శరత్ కుమార్. ఈ మధ్యన విడుదలయిన క్రాక్, నాంది సినిమాలు రెండూ ఆమెను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసాయి. దీంతో తెలుగులో చాన్స్ లు వెదుక్కుంటూ వస్తున్నాయి.
లేటెస్ట్ గా సందీప్ కిషన్ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ కు వరలక్ష్మిని తీసుకున్నారు. సినిమాలో చాలా కీలకమైన పోలీస్ క్యారెక్టర్ ఇది. దీని కోసం చాలా పేర్లు పరిశీలించి ఆఖరికి వరలక్ష్మిని ఫైనల్ చేసారు.
ఇదిలావుంటే ఇదే సినిమాలో హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ వారియర్ ను తీసుకున్నారు. ఇప్పటికే చెక్ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా చేసింది.
ఈ సినిమాలో సందీప్ సరసన హీరోయిన్ గా చేయబోతోంది. ప్రస్తుతం చకచకా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాకు నిర్మాత మహేష్ కోనేరు.