సంతోష్ నారాయణ్..తమిళనాట యువ సంగీత సంచలనం. ముఖ్యంగా రీరికార్డింగ్ కీలకమయ్యే సినిమాలకు అతగాడు హాట్ ఫేవరెట్. పిజ్జా నుంచి నిన్న మొన్నటి మద్రాస్ (కార్తీ) వరకు అన్నీ రీరికార్డింగ్ అదరగొట్టిన సినిమాలే. ఇప్పుడు అతగాడిని నాగచైతన్య-చందు మొండేటి సినిమాకు తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
హారిక హాసిని బ్యానర్ అధినేత రాథాకృష్ణ తన కొత్త బ్యానర్ పై నిర్మిస్తారీ సినిమాను. అయితే సంతోష్ నారాయణ్ తమిళనాట చాలా బిజీగా వున్నాడు. చేతిలో అరడజను సినిమాలు వున్నాయి.
అందువల్ల తెలుగులో చేసేందుకు వీలు చేసుకుంటాడా అన్నది అనుమానం. అన్నట్లు సంతోష్ నారాయణ్ తన ఎర్లీ స్టేజ్ లో ఓ తెలుగు సినిమా చేసాడు. దాని పేరు బిల్లా రంగా.