బన్నీ టైటిల్ వేస్టేనా?

ఎప్పటి నుంచో బన్నీ దగ్గర ఓ మంచి టైటిల్ వుంది. 'ఫైటర్' అన్నది ఆ టైటిల్. దాన్ని రిజిస్టర్ చేసి పెట్టుకున్నాడు. రామ్ చరణ్ – శ్రీనువైట్ల సినిమాకు పరిశీలించిన పేర్లలో ఫైటర్ ఒకటి.…

ఎప్పటి నుంచో బన్నీ దగ్గర ఓ మంచి టైటిల్ వుంది. 'ఫైటర్' అన్నది ఆ టైటిల్. దాన్ని రిజిస్టర్ చేసి పెట్టుకున్నాడు. రామ్ చరణ్ – శ్రీనువైట్ల సినిమాకు పరిశీలించిన పేర్లలో ఫైటర్ ఒకటి. అయితే దానిపై బన్నీకి చాలా ఇంట్రెస్ వుందని తెలిసి, ఇక ఊరుకున్నారు. కానీ ఆ టైటిల్ మీద చరణ్ మనసు మాత్రం పోలేదు. అందుకే తెలివిగా, బ్రూస్ లీ, ది ఫైటర్ అని పేరు పెట్టేసాడు. దీంతో బన్నీ దగ్గర వున్న టైటిల్ దాదాపు వేస్ట్ అయిపోయినట్లే.

ఈ టైటిల్ ఇలా పెడుతున్న విషయం ముందుగా అరవింద్ కు తెలియదని వినికిడి. చిరు, చరణ్ సినిమా విషయాల్లో అరవింద్ ఇప్పుడు కలుగచేసుకోవడం లేదు. దీంతో ఈ ఫైటర్ ట్యాగ్ లైన్ వాడుతున్న సంగతి ఆయనకు తెలియలేదని వినికిడి.

ఏమయితేనేం, బన్నీ ముచ్చటపడిన టైటిల్ ను ఇలా వేరే దారిలో చరణ్ కొట్టేసాడు. అంతకన్నా ఆ టైటిల్ అడిగి తీసుకుని పెట్టుకుని వుంటే, ఇటు టైటిల్ బాగుండేది. అటు బన్నీ ఫీల్ కాకుండా వుండేవాడేమో?