మంచు మనోజ్‌కి పెళ్లి?

మోహన్‌బాబు ఈరోజు వేసిన ఒక ట్వీట్‌ అందరి ఎటెన్షన్‌ రాబట్టింది. రేపు మధ్యాహ్నం తాను ఒక విషయం చెప్పబోతున్నానని, ఇది తన జీవితానికి సంబంధించి మరో ముఖ్య ఘట్టమని మోహన్‌బాబు ట్వీట్‌ చేసారు. మోహన్‌బాబు…

మోహన్‌బాబు ఈరోజు వేసిన ఒక ట్వీట్‌ అందరి ఎటెన్షన్‌ రాబట్టింది. రేపు మధ్యాహ్నం తాను ఒక విషయం చెప్పబోతున్నానని, ఇది తన జీవితానికి సంబంధించి మరో ముఖ్య ఘట్టమని మోహన్‌బాబు ట్వీట్‌ చేసారు. మోహన్‌బాబు చెప్పబోతున్న ఆ న్యూస్‌ ఏమిటా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. 

అయితే చాలా మంది మంచు మనోజ్‌కి పెళ్లి కుదిరిందని మోహన్‌బాబు చెప్తారని గెస్‌ చేస్తున్నారు. మోహన్‌బాబు చెప్పేవరకు తన పెళ్లి గురించి సస్పెన్స్‌ కొనసాగకుండా మనోజ్‌ ముందే దానిపై కర్టెన్‌ వేసేసాడు. మోహన్‌బాబు చెప్పబోయేది తన పెళ్లి గురించి కాదని, చాలా ముఖ్యమైన విషయమని అన్నాడు.     

తన పెళ్లికి ఇంకా చాలా టైమ్‌ ఉందని మనోజ్‌ స్పష్టం చేసాడు. మరి మోహన్‌బాబు చెబుతోన్న ఆ అతి ముఖ్యమైన విషయం ఏమిటి? తాను చేద్దామని చాలా కాలంగా ప్లాన్‌ చేసుకుంటూ వాయిదా వేస్తున్న రావణ చిత్రం గురించా లేక రాజకీయంగా ఆయనేదైనా కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారా లేదా వ్యక్తిగత విషయమా? ఏదేమైనా మోహన్‌బాబు ఒక చిన్న ట్వీట్‌తో చాలా ఇంట్రెస్ట్‌ పుట్టించారు.