ఎన్టీఆర్‌ తీసుకుంది బెస్ట్‌ డెసిషనా?

డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఈమధ్య కాలంలో ఎంత పేలవమైన ఫామ్‌లో ఉన్నాడనేది తెలిసిందే. నాసి రకం సినిమాలతో తనకున్న పేరుని చేతులారా చెడగొట్టుకుంటున్నాడు. ఇలాంటి టైమ్‌లో పూరితో చేయడానికి స్టార్‌ హీరోలు ఎవరూ ఆసక్తి…

డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఈమధ్య కాలంలో ఎంత పేలవమైన ఫామ్‌లో ఉన్నాడనేది తెలిసిందే. నాసి రకం సినిమాలతో తనకున్న పేరుని చేతులారా చెడగొట్టుకుంటున్నాడు. ఇలాంటి టైమ్‌లో పూరితో చేయడానికి స్టార్‌ హీరోలు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. కానీ ఎన్టీఆర్‌ మాత్రం అతనితో పని చేయాలని డిసైడ్‌ అయ్యాడు. 

జూన్‌ 21 నుంచి ఈ చిత్రం షూటింగ్‌ మొదలవుతుంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ అయ్యేలా షెడ్యూల్‌ ప్లాన్‌ చేసుకున్నారు. పూరి జగన్నాథ్‌ రాసుకుంటోన్న కథలే అతని పరాజయాలకి కారణమని, అతనిలో ఇంకా కమర్షియల్‌ హిట్స్‌ ఇచ్చే దర్శకుడు అలాగే ఉన్నాడని ఎన్టీఆర్‌ భావించాడు. అందుకే తనకి నచ్చిన కథని పూరి చేతిలో పెట్టి డైరెక్ట్‌ చేయమన్నాడు. 

ఇది కానీ వర్కవుట్‌ అయితే అటు ఎన్టీఆర్‌కే కాకుండా ఇటు పూరి జగన్నాథ్‌కి కూడా చాలా హెల్పవుతుంది. తన కథల్ని పక్కనపెట్టి వేరే కథల మీద దృష్టి పెడతాడు. ఎలాగో ఫెయిల్యూర్స్‌ నుంచి మళ్లీ పైకి లేచి భారీ హిట్స్‌ ఇచ్చిన హిస్టరీ పూరి జగన్నాథ్‌కి ఉంది కాబట్టి ఎన్టీఆర్‌ మరీ రిస్క్‌ చేస్తున్నట్టు అయితే అనుకోనక్కర్లేదు.