ప్రభాస్‌ని ఫాలో అయిపోతున్నాడు

మాస్‌ సినిమాలతో హీరోగా సక్సెస్‌ సాధించిన గోపీచంద్‌ ఆ తర్వాత అదే మూసలో పడి పలు పరాజయాలు చవిచూసాడు. కొంత కాలంగా తన సినిమాలేవీ చెప్పుకోతగ్గ స్థాయిలో ఆడడం లేదు. సాహసం ఒక్కటీ కాస్త…

మాస్‌ సినిమాలతో హీరోగా సక్సెస్‌ సాధించిన గోపీచంద్‌ ఆ తర్వాత అదే మూసలో పడి పలు పరాజయాలు చవిచూసాడు. కొంత కాలంగా తన సినిమాలేవీ చెప్పుకోతగ్గ స్థాయిలో ఆడడం లేదు. సాహసం ఒక్కటీ కాస్త ఫర్వాలేదనిపించింది కానీ అది కూడా గోపీచంద్‌ ఫ్లాపులకి అయితే బ్రేక్‌ వేయలేదు. 

మాస్‌ సినిమాలతో కెరీర్‌ స్టార్ట్‌ చేసి ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైన ప్రభాస్‌ ఇప్పుడు తనపై ఉన్న మాస్‌ హీరో ముద్ర చెరిపేసుకుని ఆల్‌ క్లాసెస్‌ హీరో అయ్యాడు. ‘మిర్చి’ చిత్రంలో అటు క్లాస్‌ని, ఇటు మాస్‌ని ఆకట్టుకునే అంశాలు మిళితం చేస్తే రిజల్ట్‌ ఎలా ఉంటుందనేది ప్రభాస్‌ చూపించాడు. 

అతడి నుంచి స్ఫూర్తి పొందిన గోపీచంద్‌ కూడా ఇప్పుడు అదే దారిలో నడిచేస్తున్నాడు. పూర్తిగా మాస్‌ సినిమాల మీద ఫోకస్‌ తగ్గించి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలున్న సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాల్లోను గోపీచంద్‌ గతంలో కనిపించిన దానికి భిన్నంగా కనిపించనున్నాడు. గోపీచంద్‌ న్యూ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ కూడా వస్తోంది. ఇక మళ్లీ హిట్‌ రావడమే తరువాయి.