జూడాలకు మళ్లీ ఎదురుదెబ్బ

సమ్మె చేస్తున్న తెలంగాణ రాష్ట్ర జూనియర్ డాక్టర్లకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు వారికి సమ్మె చేసే హక్కులేదని తేల్చి చెప్పింది. సమ్మె చేయడానికి వారేమీ దినసరి కార్మికులు కాదని, వారికి దుకాణాలు,…

సమ్మె చేస్తున్న తెలంగాణ రాష్ట్ర జూనియర్ డాక్టర్లకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు వారికి సమ్మె చేసే హక్కులేదని తేల్చి చెప్పింది. సమ్మె చేయడానికి వారేమీ దినసరి కార్మికులు కాదని, వారికి దుకాణాలు, పరిశ్రమల చట్టం వర్తించదని స్పష్టం చేసింది. విచారణ వాయిదా వేసింది. చట్టాన్ని ఇలా చేతిలోకి ఎందుకు తీసుకున్నారని నిలదీసింది. వెంటనే సమ్మె విరమించి విధులకు హాజరు కాకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది

గడచిన కొంత కాలంగా జూడాలు సమ్మె చేస్తున్నారు. దీనివల్ల పేద రోగులు నానా అవస్థ పడుతున్నారు.ప్రభుత్వం వారిని చర్చలకు పిలవడమో, సమస్యలపై చర్చించడమో చేయకుండా తాత్సారం చేస్తూ వచ్చింది. నిజానికి జూడాలు సమ్మె చేయడం ఇది తొలిసారి కాదు. ప్రతి సారీ వాళ్లు వీధులకు ఎక్కడం, ప్రభత్వం చూసీ చూడనట్లు ఊరుకోవడం, ఆఖరికి కోర్టు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి చక్కబడడం మామూలైపోయింది. 

సక్రమంగా స్టయిఫండ్ చెల్లించకపోవడం అన్నది ఒక సమస్య. దానికి మించి ఒక ఏడాది గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తేనే రికగ్నైజేషన్ ఇస్తామన్న దానిని జూడాలు వ్యతిరేకిస్తున్నారు. అలా గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడంవారికి నచ్చడం లేదు. అలా అని చెప్పకుండా ఏడాది కాకుండా మూడు నాలుగేళ్లు అని విధించి, పని చేసినవారిని ప్రభుత్వ సర్వీసుల్లోకి కచ్చితంగా తీసుకొవాలని అంటున్నారు. ఇది సాధ్యం కానిపని. 

ఏడాది పనిచేస్తే, ఏమొస్తుందని, కనీసం మూడేళ్లు పనిచేస్తే స్థానికుల ఆరోగ్యం పై ఓ అవగాహన వస్తుందని జూడాలు అంటున్నారు. అది ఒక సాకు మాత్రమే అని, నిజానికి జూడాలకు గ్రామీణ ప్రాంతంలో పనిచేయడం ఇష్టం లేదని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఇప్పటికైనా సమ్మెకొలిక్కి వస్తే పేద రోగులు ఇబ్బంది పడకుండా వుంటారు.