శిరీష్ మూడో సినిమా గీతా ఆర్ట్స్ లోనే

అల్లు శిరీష్..గౌరవం సినిమాతో తెరపైకి వచ్చాడు. ఆపై మారుతి కొత్త జంటతో ఫర్వాలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు కాస్త టైమ్ తీసుకుని మంచి ప్రాజెక్టు చేసి ఎలాగైనా నిలదొక్కుకోవాలని చూస్తున్నాడట. దీనికి సబ్జెక్ట్, డైరక్టర్…

అల్లు శిరీష్..గౌరవం సినిమాతో తెరపైకి వచ్చాడు. ఆపై మారుతి కొత్త జంటతో ఫర్వాలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు కాస్త టైమ్ తీసుకుని మంచి ప్రాజెక్టు చేసి ఎలాగైనా నిలదొక్కుకోవాలని చూస్తున్నాడట. దీనికి సబ్జెక్ట్, డైరక్టర్ ను కూడా డిసైడ్ చేసుకున్నాడు.అయితే ఆ వివరాలు ఏవీ బయటకు రాకుండా జాగ్రత్తం పడుతున్నాడు. వీలయినంత లో ప్రొఫైల్ సినిమా తీసి, విడుదల చేయాలన్నది శిరీష్ ప్లాన్ గా తెలుస్తోంది. 

అయితే గీతా ఆర్ట్స్ ఇప్పుడు చాలా సినిమాలు ప్లాన్ చేస్తోంది. చిన్న సినిమాలను వరుసపెట్టి తీయాలన్నది వారి ప్లాన్. అందులో భాగంగానే త్వరలో టీవీలో పాపులర్ అయిన ప్రభాకర్ దర్వకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. బహుశా అది అయ్యాక కానీ శిరీష్ సినిమా మొదలు కాకపోవచ్చు.