దిల్ రాజు-సునీల్ సినిమా ఏమయిందో?

హీరోగా మారిన కమెడియన్ సునీల్. పూలరంగడు వంటి మంచి హిట్ ఇచ్చినా బండి సాఫీగా ముందుకు నడవడం లేదు. మిస్టర్ పెళ్లి కొడుకు ఫ్లాపయింది. భీమవరం బుల్లోడు జస్ట్ ఓకె అయింది. తడాఖా మల్టీ…

హీరోగా మారిన కమెడియన్ సునీల్. పూలరంగడు వంటి మంచి హిట్ ఇచ్చినా బండి సాఫీగా ముందుకు నడవడం లేదు. మిస్టర్ పెళ్లి కొడుకు ఫ్లాపయింది. భీమవరం బుల్లోడు జస్ట్ ఓకె అయింది. తడాఖా మల్టీ స్టారర్. అప్పటి నుంచి మళ్లీ సినిమా సెట్ పైకి వెళ్లలేదు. మారుతి కాంబినేషన్ లో సినిమా అనుకున్నారు. కానీ బండి ఆరంభంలోనే ఆగిపోయింది. 

ఆఖరికి ఎలాగైతేనేం దిల్ రాజు నిర్మాణంలో జొష్ లాంటి సినిమా అందించిన వాసు వర్మ దర్శకత్వంలో సునీల్ సినిమా కొబ్బరి కాయ కొట్టుకుంది. కానీ అంతకు మించి ముందుకు వెళ్లలేదని తెలుస్తోంది. 

దిల్ రాజు గీతా ఆర్ట్స్ తో కలిసి సాయిధరమ్ తేజ సినిమా నిర్మాణం లో వుండడం, సాహెబా సుబ్రహ్మణ్యం ఫినిషింగ్ స్టేజ్ లో వుండడంతో, ఈ సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు వినికిడి. పైగా సునీల్ పక్కన హీరోయిన్ ఎవరు అన్నది ఫిక్స్ కాలేదు. అదో సమస్య. దానా దీనా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికే కనీసం మరో మూడు నెలలు పట్టేలా వుంది.