వెండితెరపై వెంకటేష్‌ తనయుడు

హీరో వెంకటేష్‌ తనయుడు అర్జున్‌, వెండితెరపై కన్పించబోతున్నాడట. వెంకటేష్‌, పవన్‌కళ్యాణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతోనే వెంకటేష్‌ తనయుడు తెరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. వెంకటేష్‌ తనయుడి పేరు అర్జున్‌ అన్న విషయం అందరికీ తెల్సిందే. Advertisement…

హీరో వెంకటేష్‌ తనయుడు అర్జున్‌, వెండితెరపై కన్పించబోతున్నాడట. వెంకటేష్‌, పవన్‌కళ్యాణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతోనే వెంకటేష్‌ తనయుడు తెరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. వెంకటేష్‌ తనయుడి పేరు అర్జున్‌ అన్న విషయం అందరికీ తెల్సిందే.

ఇప్పటికే రామానాయుడు మనవడు దగ్గుబాటి రాణా సినీ రంగంలో వున్నాడు. మరో మనవడు అర్జున్‌ కూడా తెరంగేట్రం చేసేస్తే.. వెంకటేష్‌ అభిమానులకి పండగే పండగ. నాగచైతన్య కూడా దగ్గుబాటి రామానాయుడికి మనవడే. దగ్గుబాటి రామానాయుడు కుమార్తెకు కొడుకు నాగచైతన్య.

ఇక, ‘గోపాల గోపాల’ సినిమా విషయానికొస్తే, ఇది బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన ‘ఓ మై గాడ్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌. ‘గోపాల గోపాల’ చిత్రానికి కిషోర్‌ పార్దసాని దర్శకుడు. పవన్‌కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడైన శరద్‌మరార్‌తోపాటు, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.