ఇక సినిమాలు చేయను.. దర్శకుడు సంచలన ప్రకటన

మలయాళంలో కల్ట్ క్లాసిక్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది ప్రేమమ్. ఆ సినిమాను తీసిన దర్శకుడు అల్ఫోన్స్ పుత్రెన్. ఇప్పుడీ దర్శకుడు సంచలన ప్రకటన చేశాడు. ఇక తను సినిమాలు తీయనని ఎనౌన్స్ చేశాడు. దీనికి…

మలయాళంలో కల్ట్ క్లాసిక్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది ప్రేమమ్. ఆ సినిమాను తీసిన దర్శకుడు అల్ఫోన్స్ పుత్రెన్. ఇప్పుడీ దర్శకుడు సంచలన ప్రకటన చేశాడు. ఇక తను సినిమాలు తీయనని ఎనౌన్స్ చేశాడు. దీనికి కారణాన్ని కూడా వెల్లడించాడు.

“నా సినిమా థియేటర్ కెరీర్ ను ఆపేస్తున్నాను. నాకు ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉంది. నిన్ననే ఈ విషయాన్ని తెలుసుకున్నాను. ఇతరులకు భారం కాదలుచుకోలేదు. అయితే సాంగ్స్, వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ మాత్రం ఓటీటీ కోసం తీస్తాను. సినిమాల నుంచి తప్పుకోవాలని నాకు లేదు, కానీ నాకు మరో ఆప్షన్ లేదు.”

ఇలా తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు పుత్రెన్. ఉన్నట్టుండి సెడన్ గా ఆరోగ్యం క్షీణించినప్పుడు లైఫ్ లో ఓ పెద్ద ట్విస్ట్ తో ఇంటర్వెల్ వచ్చినట్టు అనిపిస్తుందని తెలిపాడు. అయితే ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే అతడు తన పోస్ట్ ను డిలీట్ చేశాడు.

ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్-ఏఎస్డీ అనేది మెదడు ఎదుగుదలలో లోపం వల్ల వచ్చే ఓ మానసిక సమస్య. ఈ సమస్య ఉండేవాళ్లు సమాజంలో నలుగురితో కలవడానికి, మాట్లాడ్డానికి ఇబ్బంది పడతారు. తమ ప్రవర్తన, ఆలోచన, ఆసక్తులు పరిమితం చేసుకుంటారు. ఈ అవ్యవస్థ లక్షణాలు పిల్లల్లో, పెద్దల్లో వేర్వేరుగా ఉంటాయి. పెద్దలు చిన్నచిన్న వాసనలు, శబ్దాలు, పనులను కూడా గుర్తించి, చిరాకు తెచ్చుకుంటారు.

పైకి సాధారణంగా కనిపించే ఈ వ్యక్తుల్లో వయసు పెరిగేకొద్దీ లక్షణాలు మారిపోతుంటాయి. బాధాకరమైన విషయం ఏంటంటే, దీన్ని పూర్తిస్థాయిలో నయం చేసే చికిత్స లేదు. కొన్ని మందలు వాడడంతో పాటు, కొన్ని కృత్యాలు, సాధనల ద్వారా మోస్తరుగా సెట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా థెరపీ సెషన్స్ ద్వారా ప్రవర్తన-ఆలోచనను మార్చుకోవచ్చు. పుత్రెన్ ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాడు.