ప్రస్తుతం నడుస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షోలో బిందుమాధవి స్ట్రాంగ్ కంటెస్టెంట్. గతంలో కొన్ని సినిమాల్లో నటించిన బిందు ఎందుకో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో వుంది. మిగతా సమయాల్లో చాలా మెచ్యూర్డ్‌గా వ్యవహరించే బిందు, నామినేషన్స్‌లో మాత్రం ఆవేశంగా వ్యవహరిస్తోంది. ఇది అందరికీ సహజమే. నటరాజ్ మాస్టర్ అయితే శాపనార్థాలు పెడతాడు. గతంలో బిందు కూడా అఖిల్‌తో “పోరా రే” అంటూ అతిగా మాట్లాడింది.
అయితే సోమవారం రాత్రి బిందు ప్రవర్తన ప్రేక్షకులకే కాదు హౌస్ సభ్యులకి కూడా ఆశ్చర్యం కలిగించింది. ఏమైంది బిందుకి అని చర్చించుకున్నారు. మిత్రాని నామినేట్ చేస్తున్నప్పుడు నాటకీయంగా మాట్లాడుతూ మిత్రాని అనుకరించడం బిందులో ఎవరూ చూడని కోణం.
ఒక మనిషిపై కోపం వస్తే తిట్టడం, ఎగతాళి చేయడం సహజమే. అయితే ఎమోషన్స్‌ని అవమానించడం కరెక్ట్ కాదు. మిత్రాకి తల్లితండ్రి లేరు. ఆ అమ్మాయి తల్లిని తలుచుకుని “మమ్మీ” అని ఏడుస్తూ వుంటుంది. దాన్ని కూడా బిందు ఇమిటేట్ చేయడం ప్రేక్షకుల్లో ఆమెకున్న పాజిటివ్‌నెస్‌ని తగ్గించుకోవడమే.
పది నిమిషాల పాటు రకరకాల విన్యాసాలతో మిత్రాని ఎగతాళి చేస్తూ బిందు చేసిన మిమిక్రీ వెగటు పుట్టించింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఒక్కోసారి సైకలాజికల్ Imbalance జరుగుతుంది. బిందు కూడా దానికి గురైందా అని అనుమానం వచ్చింది.
ఇదంతా ఎందుకు, బిగ్‌బాస్ వల్ల సొసైటీకి ఉపయోగమా అంటే ఏమీ లేదు. రోజూ మనం యూట్యూబుల్లో, టీవీల్లో చూసేవి ఫోన్లలో మాట్లాడుకునేవన్నీ మెజార్టీ పనికిమాలిన విషయాలే. బిగ్‌బాస్ మన ప్రమేయం లేకుండా ఇంట్లోకి వచ్చేసింది. తెరమీద ఆటని చట్టాలు ఆపొచ్చు కానీ, ఇళ్లలో, ఆఫీసుల్లో బిగ్‌బాస్‌ని ఎవరు ఆపుతారు?
కాసేపు పొగుడుకోవడం, తిట్టుకోవడం, చాడీలు చెప్పడం… రియల్ లైఫ్‌లో కూడా ఇదే కదా! డిజిటల్ యుగంలో మనకి తెలియకుండానే ఎంటరై పోయాం. బిందు విచిత్ర ప్రవర్తన కనిపించింది. మనది కనబడదు. అంతే తేడా!
జీఆర్ మహర్షి