క్రాసింగ్ డైలాగ్ క‌త్తిరించార‌హో..

టెంప‌ర్ ట్రైలర్లో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన డైలాగ్‌.. ''ఇక్కడ మేం క్రాసింగ్‌కి వ‌చ్చి చాలాకాల‌మైంది..''. ఇదేం డైలాగ్‌రా బాబూ.. కుక్కల క్రాసింగ్‌ని మ‌నిషి సాయం చేయ‌డ‌మేంటి??  అని కొంత‌మంది జుత్తు పీక్కున్నారు. పూరి భ‌లే…

టెంప‌ర్ ట్రైలర్లో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన డైలాగ్‌.. ''ఇక్కడ మేం క్రాసింగ్‌కి వ‌చ్చి చాలాకాల‌మైంది..''. ఇదేం డైలాగ్‌రా బాబూ.. కుక్కల క్రాసింగ్‌ని మ‌నిషి సాయం చేయ‌డ‌మేంటి??  అని కొంత‌మంది జుత్తు పీక్కున్నారు. పూరి భ‌లే ఊర‌మాస్ డైలాగ్ రాశాడ‌ని అభిమానులు సంబ‌ర‌ప‌డ్డారు. 

ఈ క్రాసింగ్ గొడ‌వేంటో థియేట‌ర్లో చూద్దామ‌నుకొన్నారు. ప్చ్‌.. సెన్సార్ వాళ్లకు ఈ క్రాసింగ్ న‌చ్చలేదు. అందుకే క‌త్తిరించారు. సినిమాలో ఈ క్రాసింగ్ డైలాగుకి క‌త్తెర్లు ప‌డ్డాయి. మొత్తమ్మీద 18 క‌ట్స్‌ల‌తో ఈ సినిమా సెన్సార్ పూర్తయ్యింది. గాంధీపై కూడా ఓ డైలాగ్ రాశాడు పూరి. దేశంలో జ‌రిగే ప్రతి అవినీతికి మొద‌టిసాక్ష్యం ఈ గాంధీ… అనే  డైలాగ్‌నీ లేపేశార‌ని తెలుస్తోంది.