విల‌న్… వ‌డ్డే న‌వీన్‌

క‌థానాయ‌కుడిగా విశ్వ ప్రయ‌త్నాలు చేసినా హిట్టుకు దూర‌మ‌య్యాడు వ‌డ్డే న‌వీన్‌. ఒక‌ట్రెండు విజ‌యాలు అందుకొన్నా.. హీరోగా ఎలాంటి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేదు. చేతిలో నిర్మాణ సంస్థ కూడా ఉంది కాబ‌ట్టి, కొన్నాళ్లు బండి లాక్కొచ్చాడు.…

క‌థానాయ‌కుడిగా విశ్వ ప్రయ‌త్నాలు చేసినా హిట్టుకు దూర‌మ‌య్యాడు వ‌డ్డే న‌వీన్‌. ఒక‌ట్రెండు విజ‌యాలు అందుకొన్నా.. హీరోగా ఎలాంటి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేదు. చేతిలో నిర్మాణ సంస్థ కూడా ఉంది కాబ‌ట్టి, కొన్నాళ్లు బండి లాక్కొచ్చాడు. ఈమ‌ధ్య మ‌రీ న‌ల్లపూసైపోయాడు. ఇప్పుడు మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.. హీరోగా కాదు. విల‌న్ గా. 

ఓ యువ హీరో సినిమాలో ప్రతినాయ‌కుడిగా న‌టించ‌డానికి న‌డ్డే న‌వీన్ ఒప్పుకొన్నాడ‌ని టాక్‌. దానికి త‌గ్గట్టు లుక్ కూడా మారుస్తున్నాడు. అప్పుడెప్పుడో త‌న సినిమాలోనే నెగిటీవ్ ఛాయ‌లున్న పాత్ర పోషించాడు న‌వీన్‌. ఆ అనుభ‌వం ఈసారి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని న‌మ్ముతున్నాడు. 

ఇలా ఫేడ‌వుట్ అయిన హీరోలంతా విల‌న్లుగా మారితే.. తెలుగు సినిమాకి ప్రతినాయ‌కుల కొర‌త తీరుతుందేమో..??​