‘టెంపర్’ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికెట్ దక్కడమే చాలా మందిని ఆశ్చర్యపరిచింది. పూరి జగన్నాథ్ సినిమాల్లో డైలాగులు కాస్త శృతి మించి ఉంటాయనేది అందరికీ తెలిసిందే. అలాగే ఫైట్ సీన్లలో వయొలెన్స్ కూడా పెద్ద మొత్తంలోనే ఉంటుంది. కాబట్టి జనరల్‌గా పూరి సినిమాలకి ‘ఏ’ సర్టిఫికెట్‌కి ఫిక్స్ అయిపోతుంటారు.
కానీ ‘టెంపర్’కి మైనర్ కట్స్‌తో ‘యు/ఏ’ సర్టిఫికెట్ వచ్చిందంటే.. ఈసారి పూరి చాలా కేర్ తీసుకుని డోస్ తగ్గించాడేమో అనుకున్నారు. అయితే పూరి చెప్పిన ఆ మైనర్ కట్స్ ఏమిటో బయటకి వస్తే కానీ తెలీలేదు అవి ఎంత పెద్ద పెద్ద కట్స్ అనేది. ‘టెంపర్’లో వేసిన పద్ధెనిమిది కోతల్లో కొన్ని చోట్ల డైలాగులతో పాటు సన్నివేశాలు కూడా కట్ చేసేయాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది.
ఆ కట్ చేసిన డైలాగ్స్‌లో చాలా భయంకరమైన బూతర్ధాలు వచ్చే డైలాగులు బాగానే ఉన్నాయి. ఇక క్లయిమాక్స్ ఫైట్‌లో ముప్పయ్ శాతం తొలగించేసారట. అంటే వయొలెన్స్ తారాస్థాయిలో ఉందని అర్థమవుతోంది. ధనలక్ష్మి ఉండి ఉంటే ఈ కట్స్ అన్నిటితో పాటు ఏ సర్టిఫికెట్ వచ్చి ఉండేదేమో. కొత్త ఆఫీసర్ కనుక యు/ఏతో పాస్ అయిపోయింది.