మిల్కీ బ్యూటీ.. తమన్నాను అందరూ ముద్దుగా పిలుచుకునే పేరు ఇది. అయితే ఈ ముద్దుపేరు తనకు బొత్తిగా ఇష్టం లేదని గతంలోనే ఓసారి ప్రకటించింది ఈ హీరోయిన్. ఎవరైనా తనను మిల్కీబ్యూటీ అని పిలిస్తే చిర్రెత్తుకొస్తుందని, ఆ పదం అంటే తనకు నచ్చదని చాలా క్లియర్ గా చెప్పింది.
ఇప్పుడు అదే పదంతో ఏకంగా పాట పుట్టుకొచ్చింది. అంతేకాదు, స్వయంగా చిరంజీవి, ఆన్ స్క్రీన్ పాడుతున్న పాట అది. “అరె.. మిల్కీ బ్యూటీ, నువ్వే నా స్వీటీ” అంటూ చిరంజీవి, తమన్నాతో కలిసి డాన్స్ వేసే సాంగ్ ఇది.
హీరోయిన్లు చాలామందిపై సాంగ్స్ వచ్చాయి. ఇదే క్రమంలో తమన్నాపై కూడా రామజోగయ్య శాస్త్రి, మహతి స్వరసాగర్ కలిసి 'మిల్కీ బ్యూటీ' అంటూ ఓ పాట అల్లేశారు. బహుశా.. ఈ ట్యాగ్ లైన్ తమన్నాకు నచ్చదనే విషయం వీళ్లిద్దరికీ తెలియకపోవచ్చు.
ప్రస్తుతానికైతే ఈ పాటకు సంబంధించి ప్రోమో మాత్రమే విడుదలైంది. ఫుల్ సాంగ్ కోసం రేపటి వరకు ఆగాల్సిందే. తమన్నాను మిల్కీ బ్యూటీ అంటూ ఏ రేంజ్ లో పొగిడారో రేపు తెలిసిపోతుంది.
ఈ సంగతి పక్కనపెడితే.. భోళాశంకర్ నుంచి ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ ఏవీ చార్ట్ బస్టర్స్ అనిపించుకోలేదు. ఏదో రిలీజ్ చేస్తున్నారు, ఫ్యాన్స్ లైక్స్ కొడుతున్నారంతే. పట్టి ఊపేసేంత రేంజ్ లో లేవు. ఇప్పుడీ 'మిల్కీబ్యూటీ సాంగ్' అయినా భోళాశంకర్ కు హైప్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.