హిట్ కొట్టాడంటే రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. సరైన హిట్ లు లేకపోతే అదే రేంజ్ ఎక్కడికో దిగిపోతుంది. ఇప్పుడు కొరటాల శివ ఫస్ట్ లైన్ లో వున్నాడు. ఎన్టీఆర్ సెకెండ్ సెంటెన్స్ లో వున్నాడు.
అందుకే ఎన్టీఆర్ ఇప్పుడు షూటింగ్ బ్రేక్ చేసి, హుటాహుటిన లండన్ నుంచి వచ్చి, కొరటాల శివ ఇంటికి వెళ్లి, తరువాతి సినిమా తనతోనే చేయాలని ప్రామిస్ చేయించుకుని వెళ్లాడన్న టాక్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
ఎంతవరకు నిజమో కానీ, ఎన్టీఆర్ కేవలం కొరటాలను కలిసేందుకే లండన్ నుంచి వచ్చాడని, తానే స్వయంగా కొరటాల ఇంటికి వెళ్లి, కొన్ని గంటలు గడిపాడని అంటున్నారు. ప్రొడ్యూసర్ ఎవరైనా సరే, సినిమా తనతోనే చేయాలని కొరటాలను పదే పదే ఎన్టీఆర్ కోరాడని అంటున్నారు. దానికి కొరటాల కూడా ఓకె అన్నాడని తెలుస్తోంది.