నితిన్ సినిమాలో ఇద్దరు అమ్మాయిలు

త్రివిక్రమ్-నితిన్ కలయికలో రాధాకృష్ణ రూపొందించే సినిమా బ్యాక్ ఎండ్ వ్యవహారాలు చకచకా నడుస్తున్నాయి. అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుందని వినికిడి. ఇప్పటికే అనిరుధ్ సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు. రాజీవన్…

త్రివిక్రమ్-నితిన్ కలయికలో రాధాకృష్ణ రూపొందించే సినిమా బ్యాక్ ఎండ్ వ్యవహారాలు చకచకా నడుస్తున్నాయి. అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుందని వినికిడి. ఇప్పటికే అనిరుధ్ సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు. రాజీవన్ ను ఆర్ట్ డైరక్షన్ కు ఎంపిక చేసారు.

ఇక సినిమాటోగ్రఫీకి రాజీవ్ మీనన్ లేదా ఆ లెవెల్ టెక్నీషియన్ వ్యవహరిస్తారు. సినిమా మొత్తం కొత్త ఫీల్, లుక్, రిఫ్రెష్ నెస్ కనిపించాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే, ఇద్దరు హీరోయిన్లు వుంటారని, ఒకరు సమంత కావచ్చని వినికిడి.

మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి వుంది. సినిమా భారీ ఓపెనింగ్ సెర్మనీ లాంటి వ్యవహారాలు వుండవు కానీ, వినాయక చవితి తరువాత క్యాజువల్ అనౌన్స్ మెంట్ వుండొచ్చు.