మెగాస్టారు పసిగట్టేసారు

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా కథ, మొగుడుకావాలి..బావగారు బాగున్నారా సినిమాలకు బాగా దగ్గరలో వుంటుందని గతంలో వెల్లడించాం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా దాన్ని ధృవీకరించారు. Advertisement అడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ, ఈ…

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా కథ, మొగుడుకావాలి..బావగారు బాగున్నారా సినిమాలకు బాగా దగ్గరలో వుంటుందని గతంలో వెల్లడించాం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా దాన్ని ధృవీకరించారు.

అడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ, ఈ సినిమా గురించి విన్నాక తన మొగుడు కావాలి సినిమా గుర్తుకు వచ్చిందని, స్టోరీ లైన్ తెలుసుకున్నాక బావగారు బాగున్నారాకు దగ్గరగా వుందనిపించింది అని సభా ముఖంగానే బయటపెట్టేసారు.

అంటే హరీష్ శంకర్ చేస్తున్న ఈ సినిమా పాత వంటకమే అన్నమాట. అలాంటి లైన్ తో దిల్ రాజును ఎలా ఒప్పించాడో? అయితే తన స్టయిల్ కథనం, సాయిధరమ్ తేజ యాక్షను మీద ఆధారపడి ముందుకు సాగి వుంటాడు.

సాయి ధరమ్ కూడా మరే మొహమాటం లేకుండా ఇటు చిరు అటు పవన్ మామయ్యలను గుర్తుకు తెచ్చేలా తన స్టయిల్ ను డిజైన్ చేసుకున్నాడు. అది చాలు బి సి సెంటర్ల ఆడియన్స్ కు నచ్చడానికి.