చైతూ సరసన పరిణీతి?

పరిణీతి చోప్రా..ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మను తెలుగులోకి తెస్తారన్నది టాక్. నాగ్ చైతన్య చేయబోయే ప్రేమమ్ తెలుగు వెర్షన్ కు అవసరమైన ముగ్గురు హీరోయిన్లలో ఒకరుగా పరిణీతి…

పరిణీతి చోప్రా..ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మను తెలుగులోకి తెస్తారన్నది టాక్. నాగ్ చైతన్య చేయబోయే ప్రేమమ్ తెలుగు వెర్షన్ కు అవసరమైన ముగ్గురు హీరోయిన్లలో ఒకరుగా పరిణీతి అయితే ఎలా వుంటుందన్న డిస్కషన్లు సాగుతున్నాయి.

ఈ మేరకు ఆమెను అడగడం, ఆమె పాజిటివ్ గా రెస్పాండ్ కావడం జరిగిపోయిందని వినికిడి. కానీ డేట్ల దగ్గరే సమస్య వస్తోంది. ఆమె ఆల్రెడీ కమిట్ అయిపోయిన సినిమాలు అడ్డం పడుతున్నాయి. చైతూకేమో నవంబర్ నుంచి డేట్లుకావాలి. ఆ డేట్లు వేరే సినిమాలకు ఇచ్చేసింది.

మరేం చేయాలి..ట్రయ్ చేస్తానని మాత్రం చెప్పిందట. మరేమవుతుందో. అదే సినిమాలో మిగిలిన రెండు పాత్రలకు గాను ఒరిజనల్ లో వేసిన ఓ అమ్మాయిని, పూరి డైరక్షన్ లో లోఫర్ లో నటిస్తున్న దిశా పటాని ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.