అప‌రిచితుడితో సెక్స్ చేయ‌మంది…మాజీన‌టి

చిన్న వేధింపుల కేసుతో మొద‌లైన స్వయం ప్రక‌టిత దైవ రూపం రాధేమా… రోజు రోజుకూ కేసుల కూపంలో కూరుకుపోతోంది. ముంబ‌యికి చెందిన రాధేమా… త‌న స‌త్సంగ్ ఆశ్రమంలో చేసిన అసాంఘిక కార్యక‌లాపాలు ఒక‌టొకటిగా వెలుగు…

చిన్న వేధింపుల కేసుతో మొద‌లైన స్వయం ప్రక‌టిత దైవ రూపం రాధేమా… రోజు రోజుకూ కేసుల కూపంలో కూరుకుపోతోంది. ముంబ‌యికి చెందిన రాధేమా… త‌న స‌త్సంగ్ ఆశ్రమంలో చేసిన అసాంఘిక కార్యక‌లాపాలు ఒక‌టొకటిగా వెలుగు చూస్తున్నాయి. ఒక‌వైపు బాలీవుడ్‌తో రాధేమాకు ఉన్న స‌న్నిహిత సంబంధాలు బ‌య‌ట‌ప‌డుతున్నట్టే.. ఈమె వేధింపుల బారిన ప‌డిన‌వారిలో బాలీవుడ్ న‌టీమ‌ణులూ ఉన్న విష‌యం కూడా బ‌య‌ట‌కు వ‌స్తోంది. 

తాజాగా త‌న‌ను రాధేమా వేధించిందంటూ మాజీన‌టి డాలీ బింద్రా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆధ్యాత్మిక మార్గం అనే భావ‌న‌తో రాధేమాను ఆశ్రయించి మోస‌పోయాన‌ని ఆరోపించారామె.  త‌న‌ను అప‌రిచితుల‌తో సెక్స్ చేయ‌మంటూ రాధేమా త‌ర‌చుగా బ‌ల‌వంతం చేసేద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అంతేకాదు… ఇత‌ర భ‌క్తుల, అనుచ‌రుల ముందే త‌న‌పై అత్యాచార‌య‌త్నం జ‌రిగింద‌ని, ఈ నీచ ప్రయ‌త్నంలో రాధేమా కొడుకు సైతం పాల్గొన్నాడంటూ డాలీ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అస‌లు రాధేమా సత్సంగ్‌లో జ‌రిగేవ‌న్నీ త‌ప్పుడు ప‌నులే అంటున్న డాలీ.. ఇప్పుడే కాదు గ‌తంలో కూడా తాను పోలీసుల దృష్టికి ఈ విష‌యాలు తీసుకెళ్లాన‌న్నారు. క‌ల‌ర్స్‌టివి లో ప్ర‌సార‌మ‌య్యే బిగ్ బాస్ రియాలిటీ షో తో తిరిగి వెలుగులోకి వ‌చ్చిన డాలీ బింద్రా రాధేమాపై తాను చేసిన రాత పూర్వ‌క ఫిర్యాదులో 20మంది పేర్లు చేర్చారు.