సినిమాల పరిచయం ప్రేమకు, ఆపై పెళ్లికి దారితీయడం అన్నది మామూలే. ఈ నెల ఆఖరువారంలో విడుదలవుతోంది బెస్ట్ యాక్టర్స్ సినిమా. మారుతి ప్రెజెంట్స్ బ్యానర్ పై వచ్చే ఈ సినిమా కూడా ఓ జంటను పెళ్లిమండపానికి నడిపిస్తోందట.
ఏమిటీ వ్యవహారం అంటే..ఆ సినిమాలో నలుగురు కుర్రాళ్లలో ఒకడుగా నటిస్తున్నాడు నందు. ఆ కుర్రాడి జంటగా నటిస్తోంది. షామిలి అనే అమ్మాయి. షూటింగ్ ముగిసేలోగా ఆ షామిలి, అదే సినిమా డైరక్టర్ అరుణ్ పవర్ కలిసి పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారని వినికిడి. ఇటీవల ఎంగేజ్ మెంట్ కూడా జరిగిందట.
నలుగురు కుర్రాళ్లు, డిఫరెంట్ ఆశయాలు. అనుకోని ట్విస్ట్ లాంటి రెగ్యులర్ ఫార్మాట్ లోనే కొత్త ట్రీట్ మెంట్, ఫన్ జోడించిన సినిమా తయారుచేస్తున్నాడీ డైరక్టర్ అరుణ్ కుమార్. కొత్త ట్రీట్ మెంట్ మాటేమో కానీ, ఈ సినిమాతో కొత్త జీవితం మొదలయ్యేటట్లుంది అరుణ్ కుమార్ కు. ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.