అంకెల గందరగోళం

పెద్ద సినిమాలు షూటింగ్ ప్రారంభించుకున్న నాటి నుంచీ అంకెల గందరగోళం ప్రారంభమవుతుంది. పావలా ఖర్చయితే పది రూపాయిలు అని చెప్పడం మొదలైపోతుంది. ఆ తరువాత శాటిలైట్ దగ్గరతో బిజినెస్ లెక్కలు మొదలవుతాయి. వసూళ్ల దగ్గరా…

పెద్ద సినిమాలు షూటింగ్ ప్రారంభించుకున్న నాటి నుంచీ అంకెల గందరగోళం ప్రారంభమవుతుంది. పావలా ఖర్చయితే పది రూపాయిలు అని చెప్పడం మొదలైపోతుంది. ఆ తరువాత శాటిలైట్ దగ్గరతో బిజినెస్ లెక్కలు మొదలవుతాయి. వసూళ్ల దగ్గరా అదే గందరగోళం. ఇప్పుడు ఆగడు శాటిలైట్ లెక్కలు ఇలాగే వున్నాయి. 

పది కోట్లు, పదిహేనుకోట్లు అంటూ వదంతులు. నిజానికి ప్రస్తుతం శాటిలైట్ బిజినెస్ పడుకుంది. ట్రాయ్ నిబంధనల పుణ్యమా అని శాటి లైట్ రైట్లు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లా ఢమాల్ మన్నాయి. 

ఇప్పుడు తాజగాగా వచ్చిన అంకె తొమ్మిదింముప్పావు కోట్లు అని. మహేష్ బాబు సినిమాకు క్రేజ్ వుండడం వాస్తవం. ట్రాయ్ నిబంధనాలు లేకుంటే పదిహేను కోట్లయినా పోసి కొంటారు. అది కాదు విషయం. ఇప్పటి ఈ అంకె అయినా నిజమా కాదా అన్నదే డవుటు.