ఒక నిర్మాత ఒకే హీరోకి కట్టుబడిపోవడం చాలా సార్లు చూసాం. కొందరు హీరోలకి తమ సొంత సంస్థలు కాకుండా కొందరు నిర్మాతల బ్యానర్లు కూడా హోమ్ బ్యానర్స్ అయిపోతుంటాయి. వేర్వేరు హీరోలతో చేయడం కంటే ఒకే హీరోతో ఎన్ని సినిమాలైనా తీయడం కంఫర్టబుల్‌గా ఫీలవుతారు సదరు నిర్మాతలు.
హీరోల విషయంలో ఇది మామూలే అయినా కానీ.. హీరోయిన్లకి ఇలా హోమ్ బ్యానర్లు ఉండడం అరుదు. ప్రస్తుతం బండ్ల గణేష్ బ్యానర్ కాజల్‌కి హోమ్ బ్యానర్‌లా తయారైంది. కాజల్‌తో అప్పుడే గణేష్ మూడో సినిమాకి సైన్ చేయించుకున్నాడు. బాద్‌షా, గోవిందుడు అందరివాడేలే తర్వాత కాజల్‌ని పూరి, ఎన్టీఆర్ సినిమాలో తీసుకున్నాడు.
స్టార్ హీరోయిన్లతో పేచీలు ఎక్కువని నిర్మాతలు తరచుగా కంప్లయింట్ చేస్తుంటారు. అలాంటిది కాజల్‌తో గణేష్ అప్పుడే మూడో సినిమా తీస్తున్నాడంటే గొప్ప విశేషమే. మరి కాజల్ ఏ మంత్రం వేసిందో… లేక గణేష్ ఏం కనికట్టు చేసి కాజల్‌ని బందీని చేసాడో కానీ వీరిద్దరి వరుస అసైన్‌మెంట్స్ ఫిలిం సర్కిల్స్ దృష్టిని ఆకర్షించాయి.