టెంపర్ తో టైగర్

సందీప్ కిషన్ హీరోగా వస్తున్న మరో ప్రెస్టీజియస్ వెంచర్ టైగర్. బీరువా, టైగర్ ఈ రెండు సినిమాల మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు సందీప్ కిషన్. బీరువా అలా అలా మిగిలిపోయింది.  Advertisement ఇప్పుడు…

సందీప్ కిషన్ హీరోగా వస్తున్న మరో ప్రెస్టీజియస్ వెంచర్ టైగర్. బీరువా, టైగర్ ఈ రెండు సినిమాల మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు సందీప్ కిషన్. బీరువా అలా అలా మిగిలిపోయింది. 

ఇప్పుడు టైగర్ మాత్రం తన ఆశలు నిలబెడుతుందని ధీమాగా వున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇటీవలే ఓ ట్రయిలర్ కట్ చేసారు. దాన్ని అడియో విడుదల నాడు విడుదల చేయాలని ముందు అనుకున్నారు. 

కానీ ఇప్పుడు మళ్లీ ప్లాన్ మార్చుకుని, టెంపర్ థియేటర్లలో ప్రద్శించాలని నిర్ణయించారు. ఈ ట్రయిలర్ చాలా బాగా వచ్చిందని, సినిమా మీద క్రేజ్ పెంచుతుందని యూనిట్ ధీమాగా వుంది. మార్చి 6న టైగర్ అడియో విడదలవుతుంది. 17న సినిమా విడుదలకు ముహుర్తం నిర్ణయించారు.