కార్తికేయ‌కు ఫ్లాటైన క‌మ‌ల్‌

కాన్సెప్ట్ చిన్నదా, గొప్పదా అనేది కాదు. కొత్తగా ఉంటే చాలు. ప్రేక్షకులు ప‌ట్టం క‌డ‌తారు. అగ్ర హీరోలు వెంట ప‌డ‌తారు. కార్తికేయ విష‌యంలో అదే జ‌రిగింది. చందూమొండేటి తీర్చిదిద్దిన ఈ సైక‌లాజిక‌ల్ థ్రిల్లర్ తెలుగు…

కాన్సెప్ట్ చిన్నదా, గొప్పదా అనేది కాదు. కొత్తగా ఉంటే చాలు. ప్రేక్షకులు ప‌ట్టం క‌డ‌తారు. అగ్ర హీరోలు వెంట ప‌డ‌తారు. కార్తికేయ విష‌యంలో అదే జ‌రిగింది. చందూమొండేటి తీర్చిదిద్దిన ఈ సైక‌లాజిక‌ల్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకుల మ‌న‌సు గెలుచుకొంది. 

బ‌డా హీరోల దృష్టి చందూపై ప‌డింది. ఆఖ‌రికి న‌ట దిగ్గజం క‌మ‌ల్‌హాస‌న్ కూడా కార్తికేయ‌కు ఫ్లాటైపోయాడ‌ట‌. ఇటీవ‌ల క‌మ‌ల్ హైద‌రాబాద్ వ‌చ్చాడు. తెలుగు ద‌ర్శకులు కొంత‌మంది క‌మ‌ల్‌ని మ‌ర్యాద‌పూర్వకంగా క‌లుసుకొన్నారు. అందులో చందూ మొండేటి కూడా ఉన్నాడు. చందూని ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన క‌మ‌ల్‌… కార్తికేయ సినిమా గురించి అడిగి తెలుసుకొన్నాడ‌ట‌. 

అలాంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో క‌థ‌లేమైనా ఉంటే.. చెప్పు – మ‌నం ఓ సినిమా చేద్దామ‌ని క‌మ‌ల్ ఈ కుర్రడైరెక్టర్‌కి మాటిచ్చిన‌ట్టు తెలుస్తోంది. క‌మ‌ల్‌లాంటివాడు త‌న‌తో సినిమా చేసినా, చేయ‌క‌పోయినా 'చేద్దాం' అనే మాట ఇచ్చేస‌రికి పొంగిపోతున్నాడు కార్తికేయ ద‌ర్శకుడు. క‌మ‌ల్‌లాంటివాడు అంత‌మాట అన్నాడంటే అంత‌కంటే కావ‌ల్సిందేముంది…??  నిజంగానే క‌మ‌ల్‌ని ప‌డ‌గొట్టే క‌థ రెడీ చేస్తే.. చందూ ఓ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన‌ట్టే.