ఇల్లు కాలిపోయిందని ఒకడు ఏడుస్తుంటే, ఆ నిప్పుతో చలికాచుకొందామని సంబరపడేవాడొకడు. సినీ పరిశ్రమలో రాంగోపాల్ వర్మదీ అదే టైపు. కాదేదీ సినిమాకథకు అనర్హం అనుకొంటాడాయన. అందుకే ప్రపంచంలో ఏ టాపిక్కునైనా తన సినిమాకి అనువుగా వాడేసుకొంటాడు.
ఆఖరికి తాజ్ హోటల్‌పై దాడి జరిగితే.. దాంతో నూ సినిమా తీసేశాడు. ఇప్పుడు ఆయన దృష్టి సునంద హత్య కేసుపై పడింది. కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్యోదంతంపై ఓ సినిమా తీయాలని భావిస్తున్నాడు వర్మ. ఈ హత్య కేసులో మలుపులు సినిమా కథకి బాగా పనికొస్తాయని వర్మ ఫిక్సయ్యాడట.
ప్రస్తుతం ఈ కేసు వ్యవహారం కోర్టులో ఉంది. అవన్నీ తేలాకే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాడట. ఈలోగా ఈ సినిమా తీసి పక్కన పెడదామన్న ఆలోచనలో ఉన్నాడు. వర్మ సినిమా తీయాలంటే ఎంత సేపు…?? ఓ వారం రోజుల్లో లాగి పడేయ్యగలడు. మరో రెండు మూడు నెలల్లో ఈ సినిమా బయటకు వచ్చినా, రావచ్చు.