చూడాలనిఉంది.. మోడీ.. నిను చూడాలని ఉంది.

ఈ పాట ప్రతి వారానికీ ఓ సారి పాడేదెవరు? ఎవరో ఈ పాటికి మీరు ఊహించే ఉంటారు. Advertisement ఈ సింగర్ మళ్ళీ గత వారం నుంచీ ఈ పాట రోజూ పాడుతున్నాడు. ఆ…

ఈ పాట ప్రతి వారానికీ ఓ సారి పాడేదెవరు? ఎవరో ఈ పాటికి మీరు ఊహించే ఉంటారు.

ఈ సింగర్ మళ్ళీ గత వారం నుంచీ ఈ పాట రోజూ పాడుతున్నాడు. ఆ పాట దుబాయ్‌లో ఉన్న మోడీకి వినబడింది.

వెంటనే మోడీ తనో పాట అందుకున్నాడు.

రావోయి చంద్ర మామా ! నీ వింత గాధ  చెపుమా.. రావోయి చంద్రమామా.. అంటూ అపాయింట్మెంట్ ఇచ్చాడు.

ఆ మీటింగ్ బహుశా ఇలా ఉంటుందేమో.

xxxx

నమస్తే మోడీ సాబ్.

నమస్తే.. చంద్రన్నా. ఈ మధ్య వెంటవెంటనే యాద్ చేస్తున్నావ్.. క్యా బాత్ హై?

చంద్రబాబు వెంటనే తన భుజానికి ఉన్న బ్యాగ్లో నుంచి ఓ రికార్డ్  తీసి ప్లే చేసాడు.

యూపీఏ మా రెండు రాష్ట్రాల్ని గందరగోళంగా విడదీసింది. అందు వల్ల మాకు తీరని అన్యాయం జరిగింది.. పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో మా ఏపీ ఇరవై ఏళ్ళు వెనక్కి పోయింది.

ఈరికార్డ్ మరీ పాత దనుకుంటా  సంవత్సరం క్రితమే వేసి వినిపించావ్.. కొత్త రికార్డ్ ఏదైనా ఉంటే వెయ్యి. ఎంజాయ్ చేద్దాం.

చంద్రబాబు ఇంకో రికార్డ్ వెతికి తీసాడు.

ఇది చాలా బాగుంటుంది సార్ వినండి.

భయంకరమయిన తుఫాన్ వచ్చి వైజాగ్ మొత్తం కొట్టుకు పోయింది. ఈ సంవత్సరం వర్షాలు అస్సలు పడలేదు. పంటలకు తీరని నష్టం వాటిల్లింది. 

ఇదికూడా పాత రికార్డే  కదా? లేటెస్ట్ పాటలుంటే వెయ్ బాబూ.

చంద్రబాబు బ్యాగంతా వెతికి ఇంకో రికార్డ్ వేసాడు.

రాజధాని నిర్మాణానికి సింగపూర్ వాళ్ళోచ్చి కూర్చున్నారు. చేతిలో ఒక్క పైసా లేదు. ఉన్నపైసలన్నీ పుష్కరాలకు ఖర్చయి పోయాయ్.

ఇదీ విన్నదే కదయ్యా. రాహుల్ గాంధీ కూడా నీ టైపే! ఎప్పుడూ సూటూ బూటూ అనే పాత రికార్డ్ ప్లే చేస్తూ దేశమంతా తిరుగుతూంటాడు. కొత్తది ఉంటే చూడు.

ఎప్పటికప్పుడు కొత్తవి ఎక్కడినుంచి వస్తాయ్ సార్?

ఎందుకు రావు? మా సుష్మా స్వరాజ్‌ని చూసి నేర్చుకో బాబూ.. మొన్న పదినిమషాల్లో సరికొత్త పాట రాసి పార్లమెంట్‌లో వినిపించేసరికి అందరూ స్టన్ అయిపోయారు.

ఏమ్పాట సార్ అది?

లలిత్ మోడీ సంగతి సరే. ముందు మీయమ్మను ఆండర్సన్ సంగతి చెప్పమను.. మీ యక్కను మీ బావ ఫ్రాడ్ గురించి చెప్పమను.

ఆహా సూపర్ సాంగ్ సార్.

ఇలా కొత్తది వినిపించాలి నువ్వు కూడా.

ఇదిగో ఇది వినండి సార్.

ఏపీకి ప్రత్యెక హోదా కావాలి.

ఇదీ పాతదే స్వామీ.

అయితే ఇదివినండి.. మొన్నే నేనే రాసి నేనే కంపోజ్ చేసి.. నేనే రికార్డ్ చేయించాను….

తండ్రివి నీవే.. తల్లివి నీవే.. నన్ను ఈ కస్టాల నుంచి దరిచేర్చే దేవుడు నీవే.

ఇదేదో దేవుడి స్తోత్రం లాగుందే.

మీమీద రాసిన స్తోత్రం సార్.

నేనిలాంటివి లైక్ చేయనుకదా.

రెండో చరణం వినండి సార్.. అద్భతమైన లిరిక్ రాసాను.

అలాగా.. అయితే కంటిన్యూ చెయ్.

తండ్రివి నీవే.. తల్లివి నీవే.. నన్నీ ఓటుకు నోటు కేసులో జైలుశిక్ష నుంచి రక్షించే దేవుడు నీవే.

మోడీ లేచి నిలబడి తప్పట్లు కొట్టాడు.. అద్భుతం! అమోఘం! లిరిక్ చాలా బాగుంది.. కానీ నేను అవినీతికి వ్యతిరేకం అని నీకూ తెలుసుకదా.. అంచేత టాటా.. వీడుకోలూ.. ఇంకసెలవు.

ఈ లాస్ట్ చరణం కూడా వినండి సార్.

లలిత్ మోడీకి సుష్మతో సాయం చేయించింది నువ్వే.. రక్షణ కల్పిస్తోంది నువ్వే.. అలాగే నన్ను కూడా రక్షించు తండ్రీ.. కాపాడు తండ్రీ..

ఆఖరి చరణం చాలా బావుంది బాబూ.. గుడ్.. కీపిటప్ ఇంతకూ ఈ పాటకు టైటిల్ ఏం పెట్టావ్?

బ్లాక్ మెయిల్..

యర్రం శెట్టి సాయి