అగ్గి తోటి కడిగినా మాసిపోని మచ్చ తో సతమతమైతున్న సమాజ జీవచ్చవం, ఏ సమస్య ఎలా పరిషిన్కరించు కోవాలో చేతకాక జావ గారి పోయింది. అంతులేని నిర్లిప్తిత, స్వార్థం, సామజిక భాద్యత రాహిత్యం, అసూయ లను మనిషి అనే జంతువు తన సహజ లక్షణాలను నిస్సుగ్గు గా బయటపెట్టు కొంటున్నాడు. తనను సంస్కరిన్చుకోవడానికి సంఘం తనే ఒక పరిష్కారం, నాయకులను, యుగ పురుషలను తాయారు చేస్తుందని చరిత్ర లో విన్నాము, కాని ఇన్ని అవలక్షలను అలవోకగా వ్యక్త పరచినా కనుచూపు మేరలో కూడా కానరాని జవాబులు, నాయకులు ఎక్కడ?! ఏమైంది ఈ జీవచ్చావానికి? ఇంత స్వార్థమా? అన్నిటికి కలికాలం, కర్మ సిద్ధాంతం ముసుగు వేసి సంఘం పతనానికి ఆజ్యం పోస్తున్న ఈ వైనం అత్యంత గర్హనీయం!
కను రెప్పలె కాటేస్తే?కన్న కూతురులనే చేరిచి చంపే తండ్రులు (కాదు మనవ మృగాలు)? ఏమి ఇంకా కలిదిన్చలేదా ఆ కరకు పాషాణ హృదయాలను, అథ:పాతాళానికి అనగతోక్కబడిన విలువలకు ఆనవాళ్ళు! జీవ పరిణామం చెందని క్రూరమృగాలు కూడా తన పిల్లల్ని, తన సంఘాన్ని కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకొంటాయి. అవకాశవాది మనిషి మాత్రం అఘోర క్రూరమృగం ఎలా అయ్యాడు? ఆడ కూతురు కనపడితే ఎక్కడలేని పూనకం తో మగాడు వూగిపోవడానికి కారణం ఏమిటి? వాడు కూడా ఒక అమ్మకే పుట్టాడు కదా? తన దారికి వస్తే నెత్తిమీద పెట్టుకోవడం లేకపోతే దారికాచి వేటాడడం. ప్రేమించాలని ఒకడు, ప్రేమించలేదని ఒకడు, కట్నం కోసం ఒకడు, కోడి కూర పెట్టలేదని ఒకడు, ఆడ పిల్ల పుట్టిందని ఒకడు, అక్రమ సంబంధం కోసం ఒకడు, పరువు కోసం ఒకడు.. ఇలా మగాడు తన వికృత విన్యాసాన్ని విసృన్ఖలంగా ప్రదరిస్తుంటే, ఎక్కడ సమాజం? సమస్కరించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదే?
తరతరాలుగా ఈ అభిజాత్యాన్ని సహిస్తున్న సహనమూర్తి, శాంతి శీలి తిరగబడితే ఏమవుతుందో మగాడికి బాగానే ఎరుకనే! కాని ఏమి కాల మహిమ? ఆడదానికి ఆడదే శత్రువు అనే నానుడి అడుగడుగునా రుజువతున్నది! వ్యభిచారానికి ప్రోత్సహితున్న తల్లులు, కట్నం కోసం కోడల్లమీద, అడ్డుపడుతరేమోనని అత్తలమీద అధికారం, కాల్చుకు తింటున్న తల్లులు, పిన తల్లులు .ప్రతి సామాజిక భంధం పతనమైతున్న విలువలకు సాక్షి భూతాలు. ఎక్కడో నాయకులు పుడుతారు, మళ్లి గాడి తప్పిన ఈ సమాజాన్ని సన్మార్గం లో పెడుతారనే పాచిపోయిన సిద్థాన్థాన్ని ప్రతిపాదిన్చిండం మనకు ఆనవాయితే కదా!
సమాజం ఎటుపోతున్నదో విజ్ఞులు, వివేకులు ఆలోచించాలి.చర్చను చేపట్టాలి, నిద్ర నటిస్తున్న ఈ జీవశ్చావానికి ఊపిరులూదాలి.. మళ్లి మనిషి దానవుడు కాదు, భగవంతుడిలో ఒక భాగమనే నానుడి నిజం కావాలి, అలాంటి రోజుకోసం ఎదురుచూస్తూ!!
రంగ ఓంకారం