సెలబ్రిటీలకు ఇదేం ఆనందమో?

సెలబ్రిటీల వ్యవహారం గాజు మేడ లాంటిదే..నలుగురికి క్లియర్ విజన్. అందుకే కాస్త జాగ్రత్తగా వుండక తప్పని వ్యవహారం. నెత్తికంటేంత కోపం వచ్చినా, చిరునవ్వులు చిందించాల్సిందే. సరే, అలా చేయడం సంగతి అలా వుంచి, మరింత…

సెలబ్రిటీల వ్యవహారం గాజు మేడ లాంటిదే..నలుగురికి క్లియర్ విజన్. అందుకే కాస్త జాగ్రత్తగా వుండక తప్పని వ్యవహారం. నెత్తికంటేంత కోపం వచ్చినా, చిరునవ్వులు చిందించాల్సిందే. సరే, అలా చేయడం సంగతి అలా వుంచి, మరింత చిక్కులు కొని తెచ్చుకుంటున్నాడు హీరో రామ్ చరణ్. 

శనివారం రాత్రి రామ్ చరణ్, మరో ఇద్దరు రాజకీయ నాయకులు పిల్లలు కలిసి, తాగి నడి రోడ్డుపై నానా గత్తరా చేసినట్లు చానెళ్ల వార్తలు గుప్పుమన్నాయి. ఇదే నిజమైతే కాస్త ఇబ్బందికర వ్యవహారమే. ఆప్ కోర్స్ కావాల్సినంత పలుకుబడి వుంది కాబట్టి నడిచిపోతుంది. ఇటు అపోలో వైపు తెలంగాణలో కావాల్సినంత పలుకుబడి వుండనే వుంది. 

కేసులు వుండకపోవచ్చు..కానీ జనంలో పలుచన కావడం తప్పదు కదా? పైగా ఇప్పుడు అందరి దగ్గరా స్మార్ట్ ఫోన్ లే. ఎవరో ఒకరు ఇలా తీసి అలా అప్ లోడ్ చేస్తే, పోయే పరువు ఎవరిది? అయినా సెలబ్రిటీల పిల్లలకు ఇదేం సమస్యో? హాయిగా ఏ ఫార్మ్ హవుస్ లోనో తాగి తందనాలాడక, నడిరోడ్డు, ఎయిర్ పోర్టుల్లో వ్యవహారాలేమిటో? అంతగా అక్కడే తమ ప్రతాపం చూపించాలనుకుంటే, ఓ మాంచి సెట్ వేయించుకుని, అక్కడ మందేసి, చిందేయచ్చు కదా? 

పాపం, మన అభిమానులు వీళ్లని దేవుళ్లలా ఆరాధిస్తారు. వాళ్లపై ఈగ వాలనివ్వరు. పొరపాటున ఎవరైనా ఓ మాట అన్నా, వార్త రాసినా, తమ బూతు పాండిత్యం అంతా పరిచేస్తారు. ఇలాంటి అర్థరాత్రి వ్యవహారాలు చూసైనా ఫ్యాన్స్ వీళ్లని గుడ్డిగా ఆరాధించడం మానేయాలి.