కమల్‌హాసన్‌తో పీకే రీమేక్‌

ప్రపంచ వ్యాప్తంగా అరు వందల యాభై కోట్లకి పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించి… ఆల్‌ టైమ్‌ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ‘పీకే’ చిత్రాన్ని రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాజ్‌కుమార్‌ హిరాని డైరెక్ట్‌ చేసిన…

ప్రపంచ వ్యాప్తంగా అరు వందల యాభై కోట్లకి పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించి… ఆల్‌ టైమ్‌ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ‘పీకే’ చిత్రాన్ని రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాజ్‌కుమార్‌ హిరాని డైరెక్ట్‌ చేసిన ‘మున్నాభాయ్‌ ఎంబిబిఎస్‌’, ‘త్రీ ఇడియట్స్‌’ చిత్రాల సౌత్‌ రీమేక్‌ రైట్స్‌ తీసుకున్న జెమిని ఫిలిం సర్క్యూట్‌ పీకే హక్కుల్ని కూడా సొంతం చేసుకుంది. 

పీకే సౌత్‌ రీమేక్‌లో కమల్‌హాసన్‌ హీరోగా నటిస్తారట. దర్శకుడు ఎవరనేది కమల్‌ నిర్ణయిస్తారట. ‘మున్నాభాయ్‌’ని తమిళంలో ‘వసూల్‌రాజా ఎంబిబిఎస్‌’గా రీమేక్‌ చేసిన కమల్‌హాసన్‌ ఈసారి ‘ఏలియన్‌’ పాత్ర పోషించడానికి సుముఖత వ్యక్తం చేసారు. కమల్‌ ఈమధ్య రీమేక్‌ చిత్రాలపై ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తుండడం విశేషం. 

పీకే పాత్రకి ఆమిర్‌ ఖాన్‌ తనదైన శైలిలో అద్భుతంగా జీవం పోసాడు. మరి ఆ పాత్రని కమల్‌ ఏ విధంగా రక్తి కట్టిస్తారనేది వేచి చూడాల్సిందే. కమల్‌ ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయాలని నిర్ణయించుకోవడంపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.