పవన్‌కళ్యాణ్‌ ఇరవై కోట్ల ప్లాన్‌!!

‘గోపాల గోపాల’ చిత్రం బయ్యర్లకి కాస్త నష్టం మిగిల్చిందేమో కానీ ఈ చిత్ర నిర్మాతలు అందరూ బాగా లాభాలు వెనకేసుకున్నారు. సురేష్‌, శరత్‌ మరార్‌తో పాటు లాభాల్లో వాటా తీసుకున్న పవన్‌, వెంకటేష్‌లకి కూడా…

‘గోపాల గోపాల’ చిత్రం బయ్యర్లకి కాస్త నష్టం మిగిల్చిందేమో కానీ ఈ చిత్ర నిర్మాతలు అందరూ బాగా లాభాలు వెనకేసుకున్నారు. సురేష్‌, శరత్‌ మరార్‌తో పాటు లాభాల్లో వాటా తీసుకున్న పవన్‌, వెంకటేష్‌లకి కూడా దీనిపై బాగా మిగిలింది. తక్కువలో సినిమా పూర్తి చేయడం వల్ల నిర్మాతలకి అంతంత లాభాలొచ్చాయి. ఈ పద్ధతి బాగుందనిపించి పవన్‌కళ్యాణ్‌ తన తదుపరి చిత్రం విషయంలో కూడా ఇదే ఫాలో అవమంటున్నాడట.

‘గబ్బర్‌సింగ్‌ 2’ చిత్రాన్ని శరత్‌ మరార్‌ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి పవన్‌కళ్యాణ్‌ ఫిఫ్టీ పర్సెంట్‌ వాటాదారుడట. అంటే రెమ్యూనరేషన్‌ ఏమీ తీసుకోకుండా… వచ్చిన లాభంలో సగం పవన్‌ తీసుకుంటాడన్నమాట. ఇరవై కోట్ల లోపులోనే సినిమా షూటింగ్‌ పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకున్నారట. ఎలా చూసినా పవన్‌ సినిమాకి థియేట్రికల్‌ బిజినెస్‌ యాభై కోట్ల పరిధిలో జరుగుతుంది. 

ఇక శాటిలైట్‌ రైట్సూ అవీ కలుపుకుంటే అరవై కోట్ల వరకు వసూలవుతాయి. సో.. పవన్‌ వాటా కింద ఇరవై కోట్లు వస్తాయట. ఇకపై తను నటించే చిత్రాల బడ్జెట్‌ కంట్రోల్‌లో ఉంచి, లాభాల్లో వాటా తీసుకోవాలని పవన్‌ నిర్ణయించుకున్నాడు. ఇది నిర్మాతలకీ లాభదాయకం కనుక అందరు హీరోలు ఇదే ఫాలో అయితే బాగుంటుందని అనుకుంటున్నారు.