పవన్‌కంటే మహేషే ఫస్ట్‌

మహేష్‌, పవన్‌ ఇద్దరితో రెండేసి సినిమాలు తీసిన త్రివిక్రమ్‌ ఈ ఇద్దరితోను మరో సినిమా చేయడానికి కమిట్‌ అయ్యాడు. అయితే ముందుగా మహేష్‌తోనే మూడో సినిమా తీయబోతున్నాడు త్రివిక్రమ్‌. ఈ విషయాన్ని మహేష్‌బాబు కూడా…

మహేష్‌, పవన్‌ ఇద్దరితో రెండేసి సినిమాలు తీసిన త్రివిక్రమ్‌ ఈ ఇద్దరితోను మరో సినిమా చేయడానికి కమిట్‌ అయ్యాడు. అయితే ముందుగా మహేష్‌తోనే మూడో సినిమా తీయబోతున్నాడు త్రివిక్రమ్‌. ఈ విషయాన్ని మహేష్‌బాబు కూడా కన్‌ఫర్మ్‌ చేసాడు. కొరటాల శివ సినిమా తర్వాత చేసేది త్రివిక్రమ్‌తోనే అని చెప్పాడు. 

గబ్బర్‌సింగ్‌ 2 చిత్రాన్ని కూడా ఓ మై గాడ్‌ రీమేక్‌తో పాటు ఏక కాలంలో మొదలు పెట్టాలని పవన్‌ నిర్ణయించుకున్నాడు. ఈ రెండు చిత్రాలు వచ్చే వేసవిలోగా విడుదలైపోతాయి. అయితే ఆ తర్వాత పవన్‌ చేసే సినిమా ఏదనేది డౌట్‌లో పడిరది. త్రివిక్రమ్‌తో సినిమా ఇంకాస్త ఆలస్యం అవుతుంది కనుక గబ్బర్‌ తర్వాత పవన్‌తో చేసేది ఎవరు?     

పివిపి సినిమా బ్యానర్‌లో పవన్‌ తదుపరి చిత్రం ఖరారైంది కానీ ఇంకా దర్శకుడి విషయంలో క్లారిటీ లేదు. మిగతా అందరు స్టార్‌ డైరెక్టర్లు వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి యువ దర్శకుల్లో ఎవరో ఒకరికి పవన్‌ నుంచి పిలుపు వచ్చే అవకాశముంది. మరోవైపు మహేష్‌బాబు కూడా త్రివిక్రమ్‌ సినిమా అయ్యే వరకు తదుపరి చిత్రం గురించి ఆలోచించనని అంటున్నాడు.