అక్కినేని నాగార్జున హిట్ చూసి చాలా కాలమైంది. నాలుగైదేళ్లుగా హిట్లు లేక అల్లాడుతున్న నాగార్జునకి మనంతో ఉపశమనం దక్కింది. ఈ చిత్రం సాధించిన ఘన విజయంతో నాగార్జున బాగా సంపాదించేస్తున్నాడు. ఈ చిత్రానికి పది రోజుల్లోనే పాతిక కోట్ల షేర్ వసూలు కాగా ఇంకా స్టడీగానే రన్ అవుతోంది.
ఇదే ట్రెండు కొనసాగితే ఈ చిత్రం మరో పది కోట్లయినా రాబడుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. మరోవైపు ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ విషయంలోను పోటీ నెలకొంది. చాలా ఛానల్స్ పోటీ పడగా చివరకు జెమిని టీవీ ఈ చిత్రం ప్రసార హక్కులని ఏడు కోట్ల రూపాయలకి సొంతం చేసుకుందట.
అలాగే ఓవర్సీస్‌లో ఈ చిత్రం దాదాపు మిలియన్నర డాలర్లు ఆర్జించింది. కోటి రూపాయల రేంజ్‌లో అమ్ముడైన సినిమాకి ఇది బ్లాక్‌బస్టర్లకే బ్లాక్‌బస్టర్ రేంజ్ కలెక్షన్. అక్కడ కూడా నాగార్జునదే ఎయిటీ పర్సెంట్ షేర్ కావడంతో ఆ డబ్బులు కూడా నాగ్ జేబులోకే వచ్చి పడిపోతున్నాయి. ఈ సినిమా తలపెట్టినప్పుడు ఇంత పెద్ద హిట్టవుతుందని నాగార్జున కూడా ఊహించి ఉండడు.