మనంలో అలా మెరుపులా మెరిసిన నాగార్జున చిన్న కొడుకు అఖిల్ పెద్ద టాపిక్ అయిపోయాడు. అందరూ ఇతని గురించే తెగ మాట్లాడేసుకుంటున్నారు. హీరో కాదగ్గ లక్షణాలు అతనికి బాగా ఉన్నాయని మహేష్‌బాబుతో సహా అందరూ ముక్త కంఠంతో పొగిడేసారు. దీంతో అఖిల్‌ని ఎలాంటి సినిమాతో పరిచయం చేయాలనేది నాగార్జునకి పెద్ద ఇష్యూ అయి కూర్చుంది.
ఇంకా అఖిల్ తొలి సినిమా దర్శకుడు ఎవరనేది తేలకుండా ఉంటే ఈలోగా అతనితో రొమాన్స్ చేసే ఫస్ట్ లక్కీ లేడీ ఎవరనేది మీడియాలో హాట్ టాపిక్ అయింది. అఖిల్‌తో అల్లాటప్పా హీరోయిన్ అయితే బాగోదని, అతని అందానికి, డైనమిజానికి తగ్గ జోడీ అయితేనే బాగుంటుందని అంటున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ అయితే బాగుంటుందనేది చాలా మంది ఫీలింగ్. బాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే స్టార్‌గా ఎదిగిన ఆలియా ఇంకా దక్షిణాది వైపు చూడలేదు కానీ.. అఖిల్ పక్కన సరిజోడిగా అనిపించే లక్షణాలైతే ఆమెకి బాగానే ఉన్నాయ్. నాగార్జున ఆమెని కన్సిడర్ చేస్తే అఖిల్ ఫస్ట్ సినిమాకి నేషనల్ వైడ్‌గా కవరేజ్ లభిస్తుంది.