టెంపర్ వెనుక ఏం జరుగుతోంది

అదేదో సినిమాలో హీరో వేణు అంటాడు..'నేను ఏం చేసినా అంతే..చిరిగి చేటంతవుతుంది' అంటాడు. నిర్మాత బండ్ల గణేష్ వ్యవహారం అలాగే వుంటుంది. పాపం అదే జాతకమో. గోవిందుడు అందరి వాడేలే విషయంలో సినిమా ప్రారంభమైన…

అదేదో సినిమాలో హీరో వేణు అంటాడు..'నేను ఏం చేసినా అంతే..చిరిగి చేటంతవుతుంది' అంటాడు. నిర్మాత బండ్ల గణేష్ వ్యవహారం అలాగే వుంటుంది. పాపం అదే జాతకమో. గోవిందుడు అందరి వాడేలే విషయంలో సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి ఓ స్టేజ్ కు వచ్చేవరకు సమస్యలే..సమస్యలు. ఇప్పుడు టెంపర్ వ్వవహారం కూడా అంతే. సినిమా ప్రారంభమైంది..పారితోషికాల విషయమై డిస్కషన్లు నడుస్తున్నాయని..సినిమా వుంటుందో ఊడుతుందో తెలియదని వార్తలు వినవచ్చాయి. 

ఆఖరికి సినిమా మొదలయింది. ఇదిలా వుంటే ఎన్టీఆర్ సుకుమార్ సినిమాకు క్లాప్ కొట్టారు. అందిగో టెంపర్ ను ఎన్టీఆర్ వదిలేసాడు..ఇంక అంతే సంగతులుఅన్నారు. అంతలో ప్రకాష్ రాజ్ ఇబ్బంది పెడుతున్నాడు రావడం లేదు అన్నారు. సరే అవన్నీ జరిగి అడియో ఫంక్షన్ అయింది. ఈ ఫంక్షన్ ప్రసార హక్కులు ఓ ఛానెల్ చేతికి రావడం వెనుక కూడా మల్లగుల్లాలు పడ్డారని వార్తలు వినవచ్చాయి. ఎన్టీఆర్ పై చేసిన ఓ అరగంట ప్రోగ్రామ్ ను పక్కన పెట్టి,. ఈ అడియో ఫంక్షన్ ప్రసారం చేసారని గుసుగుసలు వినిపించాయి. అది అయింది…

ఇప్పుడు సినిమాకు ఎన్టీఆర్ చివరి రీళ్లలో డబ్బింగ్ ఆపేసాడని తెలుస్తోంది. ఇది నిజమే అయితే, ఇలా చేయడం ఎంతవరకు సబబు అన్నది నిర్మాణ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఎందుకంటే సినిమా మరో నాలుగు అయిదు రోజుల్లో విడుదల పెట్టుకుని, ఒక్క రోజులో సెన్సారు పెట్టుకుని, హీరో ఇలా చేస్తే ఎలా? బండ్ల గణేష్ డబ్బులు బాకీ వుండి వుండొచ్చు. అయితే దానికి వేరే మార్గాలే లేవా? ఇప్పుడు ఇలా చేయడం బండ్లకే కాదు ఎన్టీఆర్ కు ఇబ్బందే. సినిమాను కొనుక్కున్నవాళ్లు చివరి నిమిషం దాకా టెన్షన్ పడాలి. 

ఎన్టీఆర్ సినిమా కొంటే ఇదే పరిస్థితి అన్న టాక్ ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయితే ఏమిటి పరిస్థితి. ఎన్టీఆర్ సినిమాకు మార్కెట్ డౌన్ అయింది అన్నది నికార్సన వాస్తవం. కిందా మీదా పడి విడుదల చేయడానికి చూస్తున్నాడు బండ్ల గణేష్. సురేష్ కు నైజాం బాధ్యతలు అప్పగించి, సగం ఏరియాలు తానే విడుదల చేయాల్సిన పరిస్థితి. కారణం…మార్కెట్ లో సరైన రేటు రాకపోవడమే. ఒక్క హిట్ కొడితే మళ్లీ మార్కెట్ లెవెల్ అయిపోతుంది. 

ఈ సంగతి ఎన్టీఆర్ కు తెలియదనుకోవాలా? ప్రస్తుతానికి ఎన్టీఆర్ చేతిలో సుకుమార్ సినిమా ఒక్కటే వుంది. అది ఎప్పటికి వస్తుందో చూడాలి. అసలే ఒక పక్క తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యాడు. పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదు. బాబాయ్ తో సయోధ్యకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వార్తలు వినవచ్చాయి. మరోపక్క తాను విబేధించిన లోకేష్ దూసుకుపోతున్నాడు. 

ఇలాంటపుడు ఎన్టీఆర్ కాస్త సంయమనంతో తన కెరీర్ నుముందు తీర్చి దిద్దుకోవాల్సి వుంది. అలా కాకుంటే కష్టమే అవుతుంది..'సినిమా ఫ్లాపయినా, నేను చేస్తూనే వుంటా' అన్న డైలాగ్ బాగానే వుంటుంది. కానీ టాలీవుడ్ లో దాని రీ సౌండ్ కూడా వినిపిస్తోంది..'ఈయన చేస్తూనే వుంటాడండీ..తీసేవాళ్లు, కొనేవాళ్లు వుండాలిగా' అన్నది ఆ రీసౌండ్..నిర్మాత బండ్ల, హీరో ఎన్టీఆర్ కలిసి ఈ వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టడం అవసరం.