‘సినిమా’ టర్నింగ్ ఇచ్చుకుంది

విడుదలైన రోజు మంచి ఓపెనింగ్స్ అందుకుంది..మర్నాడు రెండు రోజులు అంతగా కలెక్షన్లు లేవు. కానీ చిత్రంగా మళ్లీ నాలుగో రోజు నుంచి పుంజుకుంది. ఇదీ ..సినిమా చూపిస్తా మావా సినిమాసంగతి. Advertisement సినిమా విడుదలకు…

విడుదలైన రోజు మంచి ఓపెనింగ్స్ అందుకుంది..మర్నాడు రెండు రోజులు అంతగా కలెక్షన్లు లేవు. కానీ చిత్రంగా మళ్లీ నాలుగో రోజు నుంచి పుంజుకుంది. ఇదీ ..సినిమా చూపిస్తా మావా సినిమాసంగతి.

సినిమా విడుదలకు ముందు దక్కించుకున్నది చాలు అని కాస్త టేబుల్ ప్రాఫిట్ కు అమ్మేసారు. ఎలాగూ శాటిలైట్ బాగానే వచ్చిందని. దిల్ రాజు సినిమా చూసి, ఫలితం ముందే ఊహించి, నైజాం ను కోటికి కోనేసాడు. ఇప్పుడు ఆయనా లాభాలు చేసుకుంటున్నాడు.

మరోపక్క ఆంధ్రలో సినిమాపై మారు బేరాలు మొదలయ్యాయి. ఇక్కడికి వదిలేస్తే, ఇంత ఇస్తాం..అంటూ బేరసారాలు మొదలయ్యాయి,. ఈ మధ్య కాలంలో బి సి సెంటర్లకు నచ్చే సరైన మాస్ కామెడీ సినిమా రాకపోవడమే ఈ సినిమా విజయానికి కారణంగా తెలుస్తోంది.