చరణ్ డైరక్టర్ గా మేఘా టర్బో అనే ఎయిర్ లైన్స్ కంపెనీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీకి చకచకా అనుమతులు వచ్చాయి. పుష్కరాలకు ముందు చకచకా విమానాలు ప్రారంభమయ్యాయి. పేరుకు చరణ్ డైరక్టర్ గా వున్నా, ఈ కంపెనీలో ఉద్యోగాలు ఎక్కువగా తెలుగుదేశం జనాలకే దక్కినట్లు సంబంధిత ఉద్యోగుల సర్కిళ్లలో వినిపిస్తోంది.
ఓ తెలుగుదేశం ఎమ్మెల్యే, ఓ తెలుగుదేశం ఎంపీల ప్రభావం ఎక్కువగా వుందని, వారి రికమండేషన్ ల తో ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలుస్తోంది. ఈ సంస్థలో ఉద్యోగం రావాలంటే, ఆ ఇద్దరు తెలుగుదేశం నాయకుల సిఫార్సులు వుంటే పని సులువు అవుతుందని కూడా వినిపిస్తోంది.
ప్రజారాజ్యం ను నమ్మకున్న వారో, కాంగ్రెస్ లో చిరంజీవి వెంట వున్నవారో, ఆఖరికి వారి సామాజిక వర్గం వారో కాకుండా, తెలుగుదేశం సిఫార్సులకు విలువ ఇవ్వడం కాస్త ఆలోచించతగ్గ సంగతే. బాబాయ్ పవన్ మాదిరిగా చరణ్ కూడా తెలుగుదేశంతో కనిపించని పొత్తు పెట్టుకున్నారేమో అని ఎయిర్ లైన్స్ సంబంథిత నిరుద్యోగులు చెప్పుకుంటున్నారు.