22న మెగా – పవర్ కలయిక

మెగాస్టార్ 60 ఏళ్ల జన్మదిన వేడుకలు ఘనంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. శిల్పకళా వేదికపై అభిమానుల సంబరం, పార్క్ హయాత్ లో సినిమా ప్రముఖల గెట్ టు గెదర్ జరుగుతుందన్నది ఇప్పటికి…

మెగాస్టార్ 60 ఏళ్ల జన్మదిన వేడుకలు ఘనంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. శిల్పకళా వేదికపై అభిమానుల సంబరం, పార్క్ హయాత్ లో సినిమా ప్రముఖల గెట్ టు గెదర్ జరుగుతుందన్నది ఇప్పటికి అందుతున్న సమాచారం.

బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఎందరో వస్తున్నట్లు సమాచారం. అంతా బాగానే వుంది. కానీ మెగాస్టార్ చోటా భయ్యా..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తాడా? ఇదే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో డిస్కషన్ పాయింట్.

అన్నదమ్ములు ఇద్దరూ ఓ చోట చేరి చాలా కాలం అయింది. అలా అని పవన్ బయటకు వెళ్లడం లేదా అంటే ఈటీవీ ఫంక్షన్ , వెంకయ్య నాయుడు చేసిన ఫంక్షన్లు అటెండ్ అయ్యారు.

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం పవన్ తన అన్నయ్య షష్టిపూర్తి వేడుకలకు హాజరవుతున్నారు. కానీ ముందు రోజు ఫ్యాన్స్ చేసే సందడికి మాత్రం రావడం లేదు. దానికి కూడా రమ్మన్నారని, అయితే ఓకె అనలేదని వినికిడి.పార్క్ హయాత్ లో జరిగే ఫ్యామిలీ ఫంక్షన్ కు మాత్రం పవన్ హాజరు కచ్చితంగా వుంటుందని తెలుస్తోంది.