గబ్బర్ సింగ్ 2 ఈ నెలలో కూడా కాదా?

గబ్బర్ సింగ్ 2 షూటింగ్ ప్రారంభం అన్నది గోడ మీద రేపు..అని రాసుకున్నట్లుంది. గడచిన మూడు నెలలుగా ఇదే తంతు. ఇప్పుడు తాజగా మార్చిలో ప్రారంభం అన్న వార్తలు వినవస్తున్నాయి. పాత స్క్రిప్ట్ కు…

గబ్బర్ సింగ్ 2 షూటింగ్ ప్రారంభం అన్నది గోడ మీద రేపు..అని రాసుకున్నట్లుంది. గడచిన మూడు నెలలుగా ఇదే తంతు. ఇప్పుడు తాజగా మార్చిలో ప్రారంభం అన్న వార్తలు వినవస్తున్నాయి. పాత స్క్రిప్ట్ కు డైరక్టర్ బాబి, కోనవెంకట్ అండ్ కో తుది మెరుగులు దిద్దుతున్నట్లు ఎప్పటిలాగే టాక్. దాన్ని పవన్ ఇంకా చూడాల్సివుందని, ఆయన చూసిన తరువాత ఫైన్ ట్యూనింగ్ వుంటుందని మరో టాక్. 

ఏదైనా మార్చికి సెట్ పైకి వెళ్లాలని కచ్చితమైన నిర్ణయంతో వున్నారట. అంటే దసరాకు ఎయిమ్ చేసుకోవచ్చు.. అభిమానులు విడుదలను. ఈ ఏడాది రెండు సినిమాలు చేయాల్సి వుంది పవన్. ఇది కనీసం జూన్, జూలైలకు పూర్తయినా ఇంకో సినిమా చేయడానిక చాన్స్ వుంటుంది.