మార్చి 6న అవును 2?

అవును 2 రవిబాబు-సురేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న హర్రర్ థ్రిల్లర్ జోనర్ సినిమా. అవును సినిమా కథ రెండు చాప్టర్లుఅనుకుంటే, ఇది రెండో చాప్టర్. దాదాపు అవును 1లో వున్న నటులంతా ఇందులోనూ…

అవును 2 రవిబాబు-సురేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న హర్రర్ థ్రిల్లర్ జోనర్ సినిమా. అవును సినిమా కథ రెండు చాప్టర్లుఅనుకుంటే, ఇది రెండో చాప్టర్. దాదాపు అవును 1లో వున్న నటులంతా ఇందులోనూ వుంటారు. ఈ సినిమా నిర్మాణం ఎప్పుడో పూర్తి చేసుకుంది.అయితే గోపాల గోపాల లో సురేష్ బిజీ కావడంతో ఇది వెనక్కు వెళ్లింది. 

ఇప్పుడు టెంపర్ విడుదలను సురేష్ బాబు తీసుకోవడంతో ఆ పనిపై వున్నారు. అందువల్ల ఫిబ్రవరి చివరికి కానీ సురేష్ వారి థియేటర్లు ఖాళీ కావు. అందుకే మార్చి 6 న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ రోజు సురేష్ సంస్థ సిబ్బంది, కొంతమంది డిస్ట్రిబ్యూటర్ ల కోసం సినిమా ప్రదర్శించారు. ఔట్ పుట్ సంగతి ఎలా, సేఫ్ బడ్జెట్. రవిబాబు, సురేష్ బాబు ఇద్దరు ప్లానింగ్ లో చాలా పద్దతిగా వుంటారు కాబట్టి, దీన్ని చాలా మినిమమ్ లో మినిమమ్ ఖర్చుతో తీసి వుంటారు. 

అందువల్ల ఆర్థికంగా విజయం అన్న సమస్య రాదు. లడ్డూ బాబుతో రవిబాబు ఇమేజ్ కాస్త దెబ్బ తింది. ఇప్పుడు అది మళ్లీ అవును 2 తో పూడ్చుకోవాల్సి వుంది. ఈ జోనర్ సినిమాలు రవిబాబు బాగానే డీల్ చేస్తారు కాబట్టి, పెద్దగా టెన్షన్ పడాల్సిన పని వుండకపోవచ్చు.