మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చికెన్..మధ్యాహ్నం లంచ్ చికెన్..సాయంత్రం స్నాక్స్ చికెన్..రాత్రి డిన్నర్ చికెన్..ఇలా రోజులో ఏం తిన్నా చికెన్ అయిటమ్ వుండాలంట ఆ హీరోయిన్ కు. ఇప్పటికే బొద్దుగా వుంది. తనతో వచ్చిన మరో ఇద్దరు హీరోయిన్లలో ఒకరు టాప్ కు చేరిపోయారు. మరొకరు గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారు.
ఇలాంటి సమయంలో అసలే చబ్బీ చీక్స్, బొద్దయిన ఒళ్లు పెట్టుకుని, రోజుకు నాలుగు సార్లు చికెన్ లాగించడం అవసరమా? అదే ఎవరయినా అడిగితే, ఐ లవ్ చికెన్..అంటూ చికెను పాఠాలు అందుకుంటోందట.
మళ్లీ అంతలోనే మాట మార్చి, అబ్బే అస్సలు తినడమే మానేసా అంటోందట. కానీ మెనూలో చికెన్ లేకుంటే ఏ పూటా ముద్ద ముట్టదని దగ్గరుండే జనాలు చెప్పేమాట.