Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రవితేజ కెరీర్ బెస్ట్ కిక్ 2

రవితేజ కెరీర్ బెస్ట్ కిక్ 2

టాలీవుడ్ మార్కెట్ పెరుగుతుండడంతో సిన్మాలకు కలసి వస్తోంది. హీరోల పాత రికార్డుల ప్లేస్ లో కొత్త రికార్డులు వస్తున్నాయి. కిక్ 2 సినిమా తొలి రోజు కలెక్షన్లు రవితేజ కెరీర్ బెస్ట్ గా నిలిచాయని తెలుస్తోంది.

తొలిరోజు హండ్రెడ్ పర్సంట్ ఫుల్స్ రాకున్నా, 7.2 కోట్ల షేర్ వచ్చింది. రవితేజ సినిమాకు ఈ మేరకు రావడం కాస్త చెప్పుకోదగ్గర విషయమే. సురేంద్ర రెడ్డి రేసుగుర్రం ఎఫెక్ట్, రవితేజ పవర్ ఎఫెక్ట్, మాగ్జిమమ్ థియేటర్లలో విడుదల చేయడం, అన్నింటికి మించి జనం ఆరేళ్లయినా కిక్ సినిమాను మర్చిపోకపోవడం వంటివి కారణాలు కావచ్చు.

సినిమాకు వీకెండ్ బి సి ల్లో బాగనే వుండే అవకాశం వుంది. అందువల్ల మూడు రోజుల షేర్ కూడా కాస్త చెప్పుకోదగ్గట్లు వుంటే బయ్యర్లు, నిర్మాత హ్యాపీ అవుతారు.  సినిమాకు ఆంధ్రలో కన్నా సీమలో టాక్ బాగుందని వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?