రుద్రమదేవి. దర్శకుడు గుణశేఖర్ కలల సినిమా. తన శక్తికి మించి డెభై కోట్లు వ్యయం చేసి నిర్మించిన సినిమా. ఇదిగో అదిగో అంటూ ఆఖరికి సెప్టెంబర్ 4 కు ఫిక్సయింది.
కొన్నాళ్ల క్రితం మార్కెటింగ్, ఫైనాన్స్ ఇస్యూలు వచ్చినా, బాహుబలి, శ్రీమంతుడు విజయాల నేపథ్యంలో పుంజుకుని, మంచి పొజిషన్ కు వచ్చింది. సెప్టెంబర్ 4 విడుదల కన్ ఫర్మ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ వెనక్కు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ రెండో వారానికి కానీ లేదా అంటే అక్టోబర్ 2న దసరాకు కానీ విడుదల అవుతుందని, సిజి వర్క్ ఇంకా పెండింగ్ వుండడమే కారణం అని గుసగుసలు వినిపిస్తున్నారు. రుద్రమదేవి వుంది అనే మరి కొన్ని సినిమాలు రెడీ అయిపోయి కూడా వెనక్కు తగ్గాయి. దాంతో ఇప్పుడు అవి ముందుకు వస్తున్నాయి.
డైనమైట్ ఈ నెల 28న, మారుతి-యువి క్రియేషన్స్-నాని ల 'భలే భలే మగాడివోయ్' సినిమా సెప్టెంబర్ 4న విడుదల చేయాలని చూస్తున్నారు. విడుదలకు సిద్ధంగా వుండాలని, రుద్రమదేవి లేకుంటే రావాలని, విడుదల వుంటే ఆగాలని ఈ సినిమాలు డిసైడ్ అయి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.