పనిలో పనిగా, తెలుగుదేశం పై మాటలు విసురుతూ పనిలో పనిగా పవన్ కళ్యాణ్ తన పాత విషయాలు కూడా చేర్చేసాడా? టాలీవుడ్ లో ఈ గుసగుస వినిపిస్తోంది.
గోపాల గోపాల సినిమాకు దగ్గుబాటి సురేష్ తో భాగస్వామ్యం ప్రాతిపదికన నిర్మించాడు పవన్ కు దగ్గరివాడు శరద్ మురార్. తీరాచేసి, ఈ సినిమా విడుదలకు ముందు లెక్కల దగ్గర తేడాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అడ్వాన్స్ ల కలెక్షన్, పంపకం ఇవన్నీ వన్ సైడ్ గా సురేష్ బాబు చేసుకుంటూ పోతుంటే, పవన్ కలుగ చేసుకోవాల్సి వచ్చిందని టాక్. పవన్ కలుగచేసుకుని గట్టిగా చెబితే తప్ప, లెక్కలు సరిగ్గా చూపించలేదని గుసగుసలు వున్నాయి.
ఇప్పుడు పవన్ ట్వీట్ లో తనకు విశాఖ, హైదరాబాద్ కొండల్లో స్టూడియోలు లేవు అన్నాడు. ఇలా రెండు చోట్లా స్టూడియోలు వున్న ఏకైక వ్యక్తి దగ్గుబాటి సురేష్ నే. పైగా ఆయన చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడు కూడా. అందుకే పనిలో పనిగా పవన్ ఈ డైలాగు వేసాడని టాలీవుడ్ సర్కిళ్లలో మాట్లాడుకుంటున్నారు.