మా మంచోడట మహేష్ బాబు

హీరోలు సినిమాల్లో ఎలాగూ హీరోలే. కానీ నిజజీవితంలో కూడా కొందరే హీరోలుగా వుండగలుగుతారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నిజ జీవితంలో కూడా హీరోలాగే వుంటాడని చాలా మంది అంటారు. ఎవరి విషయంలో ఏమో…

హీరోలు సినిమాల్లో ఎలాగూ హీరోలే. కానీ నిజజీవితంలో కూడా కొందరే హీరోలుగా వుండగలుగుతారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నిజ జీవితంలో కూడా హీరోలాగే వుంటాడని చాలా మంది అంటారు. ఎవరి విషయంలో ఏమో కానీ, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కు మాత్రం మహేష్ హీరోనే నట.

ఎందుకంటే..శ్రీకాంత్ తొలి,మలి సినిమాలకు పెద్దగా పారితోషికం రాలేదట. నెలవారీ జీతం లెక్కన చేసాడట. ఆ తరువాత ముకుంద కూడా పెద్దగా వచ్చింది లేదట. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో దగ్గర వారికి బాగా లేక, ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డాడు శ్రీకాంత్ అని వినికిడి. అప్పుడు మహేష్ నే ఆదుకున్నాడట.

పిలిచి కథ వుంటే సరే లేకుంటే తయారు చేయి అని చెప్పి, లైన్ వుందటే విని, వెంటనే బ్రహ్మోత్సవం సినిమా ప్రకటించేసాడట. మంచి పారితోషికం తో పాటు కాస్త అదనపు ఆదాయంకూడా వుండేలా చేసాడట. బ్రహ్మోత్సవం సినిమాను అద్భుతంగా తయారుచేసి, మహేష్ కు కృతజ్ఞతలు తెలిపే పనిలో సీరియస్ గా వున్నాడట శ్రీకాంత్ ఇప్పుడు.