నందమూరి కళ్యాణ్‌రామ్ ఆకర్షణీయమైన ప్రాజెక్టులు మంచి కాంబినేషన్స్‌తో సెట్ చేస్తున్నాడు కానీ అవి ఇప్పటికిప్పుడు మొదలు పెట్టడానికి తన దగ్గర డబ్బుల్లేవట. రవితేజ, సురేందర్ రెడ్డితో కిక్ 2 సినిమా నిర్మించాలని చూస్తున్న కళ్యాణ్‌రామ్ ఇంకా ఈ ప్రాజెక్ట్‌కి అవసరమైన ఫైనాన్స్ సమకూర్చుకోలేదట.
తన బ్యానర్‌పై నిర్మించిన అనేక చిత్రాలు మిగిల్చిన నష్టంతో ఇప్పుడు కళ్యాణ్‌రామ్ దగ్గర డబ్బుల్లేవు. ఈ కాంబినేషన్స్‌తో ఫైనాన్షియర్ల మీద డిపెండ్ అయి సినిమాలు తీసి లాభాలతో గట్టెక్కాల్సిందే. ఇంతవరకు కిక్ 2 పనులేమీ మొదలు కాలేదు. కళ్యాణ్‌రామ్ ఇనీషియల్‌గా పది, పదిహేను కోట్లయినా సమకూర్చుకుంటే… దీనికి కిక్ స్టార్ట్ లభిస్తుంది.
ఎన్టీఆర్ హీరోగా వక్కంతం వంశీతో ఒక సినిమా చేయాలనే ప్లాన్ కూడా కళ్యాణ్‌రామ్‌కి ఉంది కానీ దానికి ఇంకా టైమ్ పడుతుంది. ఈ రెండు ప్రాజెక్టులు ఎంత లాభదాయకం అవుతాయనే దానిని బట్టి కళ్యాణ్‌రామ్ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. కీలక సమయంలో ఎన్టీఆర్ అండ దొరకడం మాత్రం అతడి అదృష్టమనే చెప్పాలి.