విప్పుకుంటానన్నప్పుడే సినిమా తీసుండాల్సింది

అందమైన ఆడపిల్ల పందెం కట్టి బట్టలిప్పుకుని వీధుల్లో తిరుగుతానంటే గొప్ప న్యూసే కాదు, గొప్ప న్యూసెన్స్‌ కూడా. అలాగే వార్తల్లోకొచ్చిన హీరోయిన్‌ పూనమ్‌ పాండే. వరల్డ్‌ కప్‌ గెలిస్తే గుడ్డలు విప్పుకుంటానన్న మోడల్‌ పూనమ్‌…

అందమైన ఆడపిల్ల పందెం కట్టి బట్టలిప్పుకుని వీధుల్లో తిరుగుతానంటే గొప్ప న్యూసే కాదు, గొప్ప న్యూసెన్స్‌ కూడా. అలాగే వార్తల్లోకొచ్చిన హీరోయిన్‌ పూనమ్‌ పాండే. వరల్డ్‌ కప్‌ గెలిస్తే గుడ్డలు విప్పుకుంటానన్న మోడల్‌ పూనమ్‌ పాండే మాటలకు ముంబైలో శివసేన కార్యకర్తలు గూడ్డలూడదీసి కొడ్తాం జాగ్రత్త.. అని వార్నింగ్‌ ఇచ్చారు. 

ఇప్పుడు తెలుగులో ఆవిడ హీరోయిన్‌గా ‘మాలిని అండ్‌ కో’ సినిమా చేస్తోంది. వీరూ కె దర్శకత్వంలో రూపొందుతోంది ఈ సినిమా. పూనమ్‌ పాండేని హీరోయిన్‌గా పెట్టడం వెనుక ‘గుడ్డలూడదీస్తా’ పబ్లిసిటీ ఇంకా జనంలో వుందని భావించడమే ప్రధాన కారణమట. నిజానికి జనం ఆ సంగతిని ఎప్పుడో మర్చిపోయారు. 

ఒకవేళ పూనమ్‌ పాండే ఆ పనిచేసినా, కుర్రకారుని అంతగా కదిలించలేదు. ఎందుకంటే, న్యూడిటీని నిత్యం నెట్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు కాబట్టి. పూనమ్‌ పాండే ఆ మాట అన్నప్పుడే సినిమా తీసి వుంటే బావుండేది. దొంగలు పడ్డ ఆర్నెళ్ళకు కుక్కలు మొరిగినట్లు ‘మాలిని అండ్‌ కో’తో దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో జనానికి అర్థం కావడంలేదు.