అందమైన హీరోయిన్స్ రెండో పెళ్ళి వాడిని ఎందుకు ప్రేమించి వాళ్ళతో వుండిపోతారో ఇప్పటికీ పరిశోధనలో తేలని సంగతి అది. ద గ్రేట్ హీరోయిన్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని కూడా భార్యగా నేను సంతృప్తికర జీవితాన్నయితే అనుభవించలేదనే చెబుతుంది.
‘షోలే’ సినిమాతో నెంబర్ వన్ హీరోయిన్ అయిన హేమమాలినితో గొప్ప సినిమాలు తీశారు. ఏ హీరోయిన్ అందుకోనంతటి రెమ్యునరేషన్ అప్పట్లో ఆవిడ తీసుకుందట. అయితే ప్రేమ విషయంలో మాత్రం అతి సాధారణ యువతిలానే బొక్కబోర్లా పడిపోయానంటుంది.
అప్పట్లో హీరో ధర్మేంద్ర హీ మ్యాన్. మగతనం ఉట్టిపడే పంజాబీ. హేమమాలిని మాత్రం మద్రాసీ అయ్యంగార్ల ఫ్యామిలీకి చెందినది. దాంతో ధర్మేంద్రలాంటి మగాడు ఆవిడకు ఇంకెక్కడా కనిపించలేదట. అప్పటికే ధర్మేంద్రకు పెళ్ళయ్యి సన్నీడియోల్ పుట్టేసి వున్నాడట. ధర్మేంద్ర ఫిట్‌నెస్‌కి బొక్క బోర్లా పడిపోయిన హేమమాలిని ఏమైనాకానీ ఆయన లేనిదే బతకలేను.. అని డిసైడ్ అయిపోయిందట. తల్లిదండ్రులూ, స్నేహితులూ ఎన్నో చెప్పారట.
ఇంతవరకూ జరిగింది చాలు.. ఆయనతో రొమాన్స్ మరిచిపోయి, ఇంకో వ్యక్తిని పెళ్ళాడమన్నా వినకుండా ధర్మేంద్రకు రెండో భార్య అయిపోయిందట. ఆయన మొదటి భార్య నుండి అంత ప్రతికూలత రాకపోయినా, సఖ్యత అయితే లేదట. ఏదో మోజు తీరేవరకు ప్రేమ అద్భుతంగా గడిచిందట.
ఆ తర్వాత ఆయన కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటం, ఈలోగా ఇద్దరు ఆడపిల్లలు జన్మించడం, ఇప్పుడు వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి, వెనక్కి తిరిగి చూసుకుంటే గృహిణిగా తాను ఏమంత గొప్పగా జీవితాన్ని అనుభవించాను గనుక.. ఒక రకంగా ఇది రాంగ్ స్టెప్పేనని ఇప్పుడూ ఫీలవుతోందట హేమమాలిని.